NTV Telugu Site icon

Fire Accident In AP: మదనపల్లె సబ్ కలెక్టర్ ఆఫీసులో అగ్నిప్రమాదం.. ప్రభుత్వం అత్యవసర విచారణ

Fire Accident

Fire Accident

Fire Accident In AP: అన్నమయ్య జిల్లా మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయంలో అగ్ని ప్రమాదం ఘటనపై ప్రభుత్వ అత్యవసర విచారణ జరిగింది. కీలక ఫైల్స్ అగ్ని ప్రమాదంలో దగ్దం అయ్యాయని సమాచారం. నూతన సబ్ కలెకర్ట్ బాధ్యతలు చేపట్టడానికి గంటల ముందు జరిగిన అగ్ని ప్రమాద ఘటనపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అగ్ని ప్రమాదమా, కుట్ర పూరితమా అనే అంశంలో విచారణకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు.

Read Also: Janhvi Kapoor-Radhika Merchant: అందుకే రాధిక మర్చంట్‌కు పార్టీ ఇచ్చా.. జాన్వీ ఆసక్తికర వ్యాఖ్యలు!

అయితే, ఏపీ ప్రభుత్వం ఈ ఘటనను అంత్యంత సీరియస్ గా తీసుకుంది. ఉద్దేశ్య పూర్వకంగా భూములకు సంబంధించి కీలక ఫైల్స్ దగ్ధం చేశారనే ఆరోపణలపై సీఎం చంద్రబాబు తీవ్రంగా స్పందించారు. వెంటనే ఘటనా స్థలానికి హెలికాఫ్టర్ లో వెళ్లాలని డీజీపీ ద్వారాక తిరుమలరావుకు ఆదేశాలు జారీ చేశారు. మరి కాసేపట్లో మదనపల్లికి డీజీపీ, సీఐడీ చీఫ్ బయలుదేరనున్నారు. అయితే, మంటలు చెలరేగడంతో సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది హుటాహూటిన సంఘటన ప్రదేశానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు.

Show comments