NTV Telugu Site icon

Chittoor Fire Accident: ఘోర ప్రమాదం.. ఆ నిర్లక్ష్యం ఖరీదు మూడు ప్రాణాలు

Fire Ctr

Fire Ctr

ఒక్కోసారి జరిగిన ప్రమాదం కంటే.. మానవ తప్పిదాలు, నిర్లక్ష్యాలు ప్రాణాలు పోయేందుకు కారణం అవుతాయి. చిత్తూరులో జరిగిన అగ్ని ప్రమాదంలో ముగ్గురు మృతికి అగ్నిమాపక శాఖ నిర్లక్ష్యం కారణంగా చెబుతున్నారు స్థానికులు… మంటలు ఎగసి పడుతుంటే అగ్నిమాపక శాఖ ఆలస్యంగా రావడం ఒక కారణం కాగా, తెచ్చిన సగం నీళ్ళు అయిపోయాయి. దీంతో నీటిని పట్టుకుని వస్తామని అగ్నిమాపక శాఖ సిబ్బంది చెప్పారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్దానికులు… వారి నిర్లక్ష్యం కారణంగానే ముగ్గురు ప్రాణాలు కోల్పోయారంటున్నారు.

స్థానికులైన తాము కిటికీలు పగులగొట్టి ప్రయత్నం చేశామే గాని వారు మాత్రం రాలేదంటున్నారు. అసలు చిత్తూరు అగ్నిప్రమాదంలో ముగ్గురు మృతికి కారణం ఎవరు? చిత్తూరు నగరంలోని రంగాచారి వీధిలో పేపర్ ప్లేట్లు తయారీ భవనంలో షార్ట్ సర్క్యూట్‌తో అగ్ని ప్రమాదం జరిగింది. దీంతో భవనంలో మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. మంట్లలో చిక్కుకుని ముగ్గురు ప్రాణాలు కోల్పోయారని పోలీసులు తెలిపారు. మృతుల్లో తండ్రి ,కొడుకుతో పాటు స్నేహితుడున్నాడు. సకాలంలో ఫైరింజన్లు రాకపోవడంతో ప్రమాద తీవ్రత పెరిగిందంటున్నారు.

Read Also: AP Assembly Last Day: ఇవాళ్టితో ముగియనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలు

అక్కడే వున్న స్థానికులు ప్రమాదం గురించి తెలుసుకుని సహాయక చర్యల్లో పాల్గొన్నారు. ప్రమాదం జరిగిన భవనం గోడలు పగులగొట్టి స్పృహ కోల్పోయిన వారిని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే ముగ్గురు చనిపోయారని వైద్యులు తెలిపారు. ఈ ప్రమాదంలో మరణించిన వారిని భాస్కర్ (65), ఢిల్లీ బాబు (35) బాలాజీ (25)గా గుర్తించారు. అర్థరాత్రి 2 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ముగ్గురు సజీవ దహనం కావడంతో విషాదం నెలకొంది.

Read Also: Gujarat: 15 ఏళ్ల బాలుడిని చంపేసిన సింహాలు..