Site icon NTV Telugu

Buggana Rajendranath Reddy: టీడీపీకి మ్యాటర్ వీక్….పబ్లిసిటీ పీక్

Buggana Rajendranath Reddy

Buggana Rajendranath Reddy

ఒకవైపు ఏపీ బడ్జెట్ పై సమాధానం ఇస్తున్న ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పిట్టకథలతో రక్తి కట్టించారు. టీడీపీ పై ఆర్థికమంత్రి బుగ్గన సెటైర్లు వేశారు. నేను ఇంకా భోజనం చేయలేదు. టీడీపీ వాళ్లు శుభ్రంగా భోంచేసి పడుకుని ఉంటారు. బడ్జెట్ పై చర్చ జరుగుతుంటే ఎవరైనా అల్లరి చేసి వెళ్లిపోతారా?35 ఏళ్ళ వయస్సులో ఎవరైనా బయోగ్రఫీ రాసుకుంటారా…?మనసులో మాట అని చంద్రబాబు రాసుకున్నాడు.అప్పటి నుంచి అల్లాడి పోతున్నాడు. మనం పుస్తకం తీయటం చదవటం…ఆ పుస్తకంలో ఉచిత సేవల కాలం పోయింది…ఇప్పుడు ప్రజల నుంచి డబ్బు సేకరించాలి అని చంద్రబాబు పుస్తకంలో రాశాడు.

Read Also: Pawan Kalyan: స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో జరిగిన ప్రమాదం దురదృష్టకరం

రెండు రూపాయల బియ్యం ఇచ్చినా ఎన్టీఆర్ ఓడిపోయారు అని రాశాడు. ప్రాజెక్టులు కడితే లాభం లేదు అని చంద్రబాబు రాశాడు. 60 శాతం ఉద్యోగులు అవినీతి పరులే అన్నాడు. టీడీపీకి మాటర్ వీక్….పబ్లిసిటీ పీక్ అన్నారు. అసంతృప్తి వాదులకు అసెంబ్లీలో పిట్ట కథ చెప్నారు ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్. పాలనలో కావల్సింది వేగం కాదు స్థిరత్వం అన్నారాయన. చర్చ అనంతరం ఏపీ అసెంబ్లీ రేపటికి వాయిదా పడింది.

Read Also: Cold Storage Collapse: కోల్డ్ స్టోరేజ్ కుప్పకూలిన ఘటనలో 10కి చేరిన మృతుల సంఖ్య

Exit mobile version