NTV Telugu Site icon

Washing Machine: వాషింగ్‌ మిషన్ వివాదం.. వివాహితను ఇనుప రాడ్డుతో కొట్టి చంపిన తండ్రి, కొడుకు

Washing Missin

Washing Missin

Washing Machine: వాళ్లిద్దరు ప్రేమించుకున్నారు. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. వీరి ప్రేమకు గుర్తుగా ముగ్గరు పిలల్లలు వున్నారు. కలతలు లేకుండా వారి జీవితం అన్యోన్యంగా సాగుతున్న జీవితంలో వాషింగ్‌ మిషన్‌ వివాదం ఆమె ప్రాణాలు బలితీసుకుంది. వాషింగ్‌ మిషన్‌ వివాదంతో ఒకరినొకరు వాదోపవాదాలు చేసుకున్నారు. చివరకు అది ఆమెపై దాడి చేసేవరకు వెళ్లడంతో ఆమె ప్రాణాలు విడిచింది. ఈ విషధ ఘటన సత్యసాయి జిల్లా కదిరి లో చోటుచేసుకుంది.

Read also: Directors: హిట్ దర్శకుల నెక్స్ట్ సినిమాలు ఏంటి?

శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణంలోని మాషానంపేట కాలనీలో దంపతులు పద్మావతి బాయి, మనోజ్ కుమార్ నివసిస్తున్నారు. పద్మావతీబాయి రోజూలాగానే ఇంట్లోని వాషింగ్ మిషన్ తో తల బట్టలు ఉతకడానికి వేసింది. అయితే అదే తన ప్రాణానికి దారి తీస్తుందని ఊహించేకోలేదు ఆమె. వాషింగ్ మిషన్ లో బట్టలు వేడయం అయిపోయింది. అయితే అందులోనుంచి వచ్చే బట్టల మురికి నీరు వాషింగ్ మిషన్ నుంచి బయటకు పంపే వ్యవహారంలో పక్కింటి వారికి పద్మావతి కి గొడవ ప్రారంభమైంది. వాషింగ్ మిషన్ నుంచి వచ్చే వ్యర్థ నీరు పక్కనే ఉన్న వేమన్న నాయక్ ఇంటికి వెళ్లింది. బయటకు వచ్చిన వేమన్న నాయక్ పద్మావతి తో గొడవ పడ్డాడు. మురికి నీరు ఇంటి ముందుకు వస్తున్నాయి ఇలా రాకుండా చూడాలని వాదించాడు. దీంతో పద్మావతి ససేమిరా అంది. వేమన్న నాయక్, అతని కుమారుడు రంగంలోకి దిగడంతో ఇరు కుటుంబాల మధ్య వాగ్వాదం జరిగి ఘర్షణకు దారితీసింది.ఈ క్రమంలో వేమన్న నాయక్, అతని కుమారుడు ప్రకాష్ నాయక్ పద్మావతిపై ఇనుప రాడ్, రాళ్లతో దాడి చేశారు. దీంతో ఆమె ముఖం, తలపై తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే కుటుంబ సభ్యులు పద్మావతిని కదిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందింది. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.