అనందయ్య విషయంలో సీఎం వైఎస్ జగన్‌పై మెడికల్ మాఫియా ఒత్తిడి చేస్తుందనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయన్నారు మాజీ ఎంపీ హర్షకుమార్.. ఇక, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా మరణాల సంఖ్యను దాచిపెట్టడం సరికాదని హితవు పలికిన ఆయన.. ఇటీవల తూర్పుగోదావరి జిల్లాలో బులిటెన్ ప్రకారం 13 మంది చనిపోయినట్లు చూపించారు.. అదేరోజు జిల్లాలో 200 మందికి పైగా కోవిడ్ తో చనిపోయారని ఆరోపించారు.. ప్రస్తుతం ప్రజలు కరోనా గురించి భయపడటం లేదన్న ఆయన.. అమెరికాలో కరోనాతో చనిపోయిన వారి లెక్కలను ఆ దేశం దాచిపెట్టలేదు.. కానీ, ఇక్కడ పరిస్థితి వేరుగా ఉందన్నారు. సీఎం వైఎస్ జగన్ చెబుతున్నట్లుగా 104 ద్వారా ప్రభుత్వ ఆసుపత్రుల్లో బెడ్లు దొరకడం లేదన్న హర్షకుమార్.. ముఖ్యమంత్రి మిగిలిన అన్ని విషయాలు పక్కపెట్టి కొవిడ్ పై దృష్టి పెట్టాలని సూచించారు.
ఇక, నెల్లూరు అనందయ్యపై ప్రజల నమ్మకాన్ని ప్రభుత్వం అడ్డుకోవడం సరికాదు అన్నారు హర్షకుమార్… కృష్ణపట్నం మందు పంపిణీని అడ్డుకోకుంటే గత నాలుగు రోజులుగా వేల మంది కరోనా రోగులకు మేలు జరిగేదన్న ఆయన.. అనందయ్య విషయంలో సీఎం జగన్‌పై మెడికల్ మాఫియా ఒత్తిడి చేస్తుందనే అనుమానాలు ప్రజల్లో కలుగుతున్నాయన్నారు. కాగా, ఇప్పటికే ఆనందయ్య కరోనా మందుపై ఆయుష్ నివేదిక సీఎం వైఎస్ జగన్‌ను చేరిన సంగతి తెలిసిందే.. పూర్తిస్థాయి నివేదిక తర్వాత ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది.