Site icon NTV Telugu

Gorantla Madhav: నేడు జైలు నుంచి విడుదల కానున్న మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్..

Gorantla

Gorantla

Gorantla Madhav: వైసీపీ మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కు గుంటూరు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఈ నెల 11వ తేదీ నుంచి రాజమండ్రి సెంట్రల్ జైల్ లో అతడు రిమాండ్ లో ఉన్నాడు. ఇక, బెయిల్ పత్రాలు సమర్పించిన అనంతరం ఇవాళ రాజమండ్రి జైలు నుంచి గోరంట్ల విడుదలయ్యే అవకాశం ఉంది. అలాగే, ప్రతి శనివారం గుంటూరు నగరం పాలెం పోలీస్ స్టేషన్ కి వెళ్లి సంతకం చేయాలని న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. రెండు నెలల పాటు పీఎస్ లో సంతకం పెట్టాలని సూచించింది.

Read Also: UP: దారుణం.. పెళ్లిలో పనీర్ వడ్డించలేదని అతిథులపైకి బస్సు నడిపిన యూపీ వ్యక్తి.. ఆ తర్వాత ఏమైందంటే..!

కాగా, రూ. 10 వేల పూచీకత్తు, ఇద్దరు జామీన్ల హామీతో వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ కి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. గత నెల 10వ తేదీన టీడీపీ కార్యకర్త చేబ్రోలు కిరణ్ తో పాటు ఎస్కార్ట్ పోలీసులపై దాడి చేసిన కేసులో గోరంట్ల మాధవ్ అరెస్ట్ అయ్యారు. ఆయనతో పాటు రాజమండ్రి జైలులో రిమాండ్ లో ఉన్న ఐదుగురు అనుచరులకు
బెయిల్ మంజూరు అయింది. ఇక, ఈనెల 23, 24 తేదీల్లో గోరంట్ల మాధవ్ ను కస్టడీలోకి తీసుకుని గుంటూరు పోలీసులు విచారించారు.

Exit mobile version