Chandrababu Naidu: జగన్ హయాంలో పారిశ్రామిక ప్రమాదాల జోరు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
విశాఖ అచ్యుతాపురంలోని ఓ పరిశ్రమలో జరిగిన ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు (Chandrababu Naidu). వైసీపీ ప్రభుత్వం వచ్చాక విశాఖలోని ఎల్‌జీ పాలిమర్స్ మొదలుకుని వరుసగా పారిశ్రామిక ప్రమాదాలు జరగడం, కార్మికులు బలవ్వడం సాధారణమైంది.కమిటీలు వేసి చేతులు దులుపుకుంటే సరిపోదు.
పరిశ్రమల్లో భద్రతా ప్రమాణాలపై పర్యవేక్షణ ఉంటే ఇన్ని ప్రమాదాలు జరగవు, లోపం ప్రభుత్వంలోనే ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం మేల్కొని పారిశ్రామిక ప్రమాదాలను నివారించాలి. మృతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలి. అచ్యుతాపురం సెజ్‌లోని సీడ్స్ వస్త్రపరిశ్రమలో ఇదే ఏడాది జూన్ 3న విషవాయువులు లీకై 469 మంది మహిళా కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
Also Read
- Veligonda Project: 30 ఏళ్ల కల సాకారం.. రేపు వెలిగొండ ప్రాజెక్టు ఫేజ్-1 ప్రారంభించనున్న సీఎం..
- Vijaysai Reddy: సొంత కారణాలతోనే విజయసాయి రెడ్డి బయటకు వెళ్లారు.. పబ్లిసిటీ కోసం ప్రయత్నిస్తున్నారు!
- Rajamahendravaram: గోదావరిలో హౌస్‌బోట్.. రాజమహేంద్రవరంలో పర్యాటకానికి ఫుల్ జోష్!
- Tirupati: శేషాచలం అడవుల్లో రెండుగా విడిపోయిన ఏనుగుల గుంపు.. అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక!

నాటి ప్రమాదంపై ప్రభుత్వం విచారణ కమిటీని నియమించినా ఇప్పటివరకు ప్రమాదానికి కారణాలేంటో కమిటీ చెప్పలేకపోయింది. అదే పరిశ్రమలో ఇప్పుడు మరోసారి వెలువడిన విషవాయువును పీల్చి దాదాపు 100 మంది మహిళా కార్మికులు అస్వస్థతకు గురయ్యారు. అలాగే తూర్పుగోదావరి జిల్లాలోని దేవరపల్లి లోని బయోటెక్ మొక్కజొన్న ఫ్యాక్టరీలో బాయిలర్ క్లీన్ చేసే క్రమంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. ఈ ఏడాదే ఏప్రిల్ నెలలో ఏలూరు జిల్లా అక్కిరెడ్డిగూడెంలోని పోరస్ కర్మాగారంలో భారీ ప్రమాదం జరిగి ఆరుగురు కార్మికులు మరణించారు. ప్రమాదాల నివారణకు చర్యలు చేపట్టాలని, పారిశ్రామిక వాడల్లో భద్రతా ప్రమాణాలు పాటించాలన్నారు.
Atchutapuram Gas Leak: గ్యాస్ లీక్ ఘటనపై సర్కార్ సీరియస్.. కంపెనీ మూసివేతకు ఆదేశాలు
తాజావార్తలు
-
Pak Spy Network Busted: మేడ్ ఇన్ చైనా కెమెరాలు, పాక్‌కు లైవ్.. ఐఎస్ఐ గూఢచారి అరెస్ట్..
-
Bilawal Bhutto: యూరప్ యువరాణితో బిలావల్ భుట్టో పెళ్లి! సోషల్ మీడియాలో వైరల్
-
Viral Video : గుండెలను పిండేస్తున్న దృశ్యం.. చెల్లెలితో చిన్నారి.. తల్లిదండ్రుల కోసం వెతుకులాట.!
-
Uttar Pradesh: యూపీలో హిందూ లీడర్ ధీరేంద్ర ప్రతాప్ సింగ్ హత్య..
-
North Cyprus: ఘోర ప్రమాదం.. సముద్రంలో ఫెర్రీ బోల్తా.. 270 మంది ఉన్నట్లు సమాచారం
ట్రెండింగ్
-
Mouth Ulcer: చిన్న నోటిపుండే కదా అని లైట్ తీసుకుంటున్నారా? ఈ మార్పులు కనిపిస్తే తప్పక డాక్టర్‌ను సంప్రదించాల్సిందే.!
-
Rose Water: ముఖానికి ఫ్రెష్‌నెస్, హైడ్రేషన్ కావాలా.? అయితే ఇంట్లోనే రోజ్ వాటర్ ఇలా తయారు చేసుకోండి..!
-
మార్కెట్లో కిలో రూ.1500.. ఇంట్లోనే కేవలం 15 నిమిషాల్లో ‘కాజూ కట్లీ’ తయారీ చేయండి ఇలా.!
-
Hockey World Cup 2026: నెదర్లాండ్స్ ఆధిపత్యానికి చెక్.. 16 ఏళ్ల తర్వాత హాకీ ప్రపంచకప్ గెలిచిన అర్జెంటీనా!
-
House Construction Cost: ఇల్లు కట్టే ఆలోచన ఉందా?.. కేవలం 5 నిమిషాల్లో బడ్జెట్ అంచనా వేసే సింపుల్ ట్రిక్ ఇదే!