Smart Meters: స్మార్ట్ మీటర్లపై అపోహలు వద్దు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
స్మార్ట్ మీటర్ల విషయంలో అపోహలు వద్దన్నారు ఏపీ ప్రభుత్వ ఇంధన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి విజయానంద్. మారుతున్న సాంకేతికని ఇంధన శాఖ అందిపుచ్చుకుంటోంది. ట్రాన్స్‌కో లో ప్రతీ జిల్లాలో 400 కెవి సబ్ స్టేషన్స్ అందుబాటులోకి తీసుకువచ్చాం. వినియోగదారులకు వేగంగా సేవలు అందించడానికే స్మార్ట్ మీటర్లు పెడుతున్నాం అన్నారు. స్టాండర్డ్ బిడ్డింగ్ డాక్యుమెంట్ దేశమంతా ఒకేలా ఉంటుంది. రాష్ట్ర ప్రభుత్వానికి టెండర్లని పిలవడం తప్పితే మార్చే అధికారం లేదు. మొదటి ఫేజులో 27 లక్షల మీటర్లు స్మార్ట్ మీటర్లు బిగిస్తాం. ఇందులో 4.72 లక్షలు మాత్రమే గృహావసరాల కనెక్షన్స్ ఉన్నాయన్నారు విజయానంద్.
Read Also: Power outage at Airport: ఎయిర్ పోర్టుకు పవర్ కట్.. నిలిచిన 282విమాన సర్వీసులు
Also Read
అమృత్ సిటీలోని జిల్లా హెడ్ క్వార్టర్స్ లో 200 యూనిట్లు దాటిన 4.72 లక్షల కనెక్షన్స్ కి మాత్రమే స్మార్ట్ మీటర్లు బిగిస్తాం. రాష్ట్రం మొత్తం 1.80 కోట్లు వినియోగదారులు ఉన్నారు. 1.80 కోట్ల కనెక్షన్లకి స్మార్ట్ మీటర్లనేది అవాస్తవం. 13.54 లక్షల మందికి సెకండ్ ఫేజులో స్మార్ట్ మీటర్లు ఇవ్వాలని నిర్ణయిస్తున్నాం. ఇంకా టెండర్లు పిలవలేదు. ఉత్తర ప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్ వంటి 15 రాష్ట్రాలు స్మార్ట్ మీటర్లకి టెండర్లు పిలిచాయి. ఏపీ 16వ రాష్ట్రంగా టెండర్లు పిలుస్తోంది. 2025 మార్చ్ నాటికి దేశవ్యాప్తంగా స్మార్ట్ మీటర్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా అన్ని రాష్ట్రాలు ముందుకు వచ్చాయన్నారు.
ఇందుకు కేంద్రం నుంచి 5, 484 కోట్లు గ్రాంటుగా వస్తాయి. స్మార్ట్ మీటర్ల ద్వారా వినియోగదారులకి అదనపు భారం పడదు. రైతులకి భారం పడకుండా ప్రభుత్వమే స్మార్ట్ మీటర్ల భారాన్ని భరిస్తోంది. స్మార్ట్ మీటర్ల విషయంలో స్పష్టమైన విధానంతో ఇంధన శాఖ ముందుకు వెళ్తోంది. అన్ని డిస్కమ్ లతో చర్చించిన తర్వాతే ఇంధన శాఖ ఈ నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ మొత్తం ప్రాజెక్ట్ పూర్తి అయితే దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల ఇంధన వ్యయ వినియోగం నేషనల్ మీటరింగ్ మోనిటరింగ్ సిస్టం పరిధిలోకి వెళ్తాయి. ఇంధన శాఖకి వ్యవసాయ, గృహ అవసరాల స్మార్ట్ మీటర్ల ప్రాజెక్ట్ పై ఎటువంటి అభ్యంతరాలు లేవు. స్మార్ట్ మీటర్ల వల్ల వినియోగదారులకి ఎక్కువ బిల్లులు వస్తాయనేది అపోహ మాత్రమే అన్నారు.
Read Also: New Year Celebrations: గుంటూరు సీఐ ఓవరాక్షన్.. యువకులపై లాఠీఛార్జి చేయడంపై విమర్శలు
తాజావార్తలు
-
Anushka Shetty : అనుష్క ఇక సినిమాలు చేయడం.. బయట కనిపించడం కష్టమే..
-
Donald Trump: “ఇకపై ఇరాన్ అనే దేశమే ఉండదు”.. ట్రంప్ బిగ్ వార్నింగ్.. ఆందోళనలో ప్రపంచ దేశాలు!
-
Joseph Vijay : ‘మెగా 158’ నిర్మాతకు క్యాబినెట్ హోదా.. సీఎం విజయ్ నిర్ణయం వెనుక అసలు కారణమేంటి?
-
Abhishek Sharma Fifty: షాకింగ్.. అభిషేక్ శర్మ అర్ధ శతకం రద్దు.. కారణం ఏంటో తెలుసా?
-
Japan Earthquake: జపాన్‌లో 6.1 తీవ్రతతో భూకంపం.. వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 11 ప్రధాన ప్రకంపనలు
ట్రెండింగ్
-
Kitchen Tips : ప్రెషర్ కుక్కర్ రబ్బర్ వదులై గ్యాస్ లీక్ అవుతుందా? ఈ సింపుల్ చిట్కాలు ట్రై చేయండి.!
-
Lunch Box Cleaning : లంచ్ బాక్స్ రబ్బరు మురికితో నల్లబడిందా..? ఇలా సింపుల్‌గా మెరిపించండి.!
-
Positive Energy at Home: ఇంట్లో నెగెటివ్ ఎనర్జీకి చెక్.. ఈ చిట్కాలతో పాజిటివ్ ఎనర్జీ మీ సొంతం.!
-
Mohanlal: ‘ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్’.. ఇద్దరు హీరోయిన్లతో డాన్స్ అదరగొట్టిన మలయాళి మెగాస్టార్.!
-
YouTube Shortsలో కొత్త ఫీచర్లు.. 2X స్పీడ్, క్లియర్ స్క్రీన్ మోడ్‌తో మరింత సౌలభ్యం.!