NTV Telugu Site icon

Nimmala Ramanaidu: వైసీపీకి పోలవరంపై మాట్లాడే అర్హత లేదు.. ఆ సమయానికి ప్రాజెక్టు పూర్తి చేసి తీరుతాం..

Nimmala Ramanaidu

Nimmala Ramanaidu

Nimmala Ramanaidu: వైసీపీకి పోలవరంపై మాట్లాడే అర్హత లేదని మండిపడ్డారు మంత్రి నిమ్మల రామానాయుడు.. పోలవరం ప్రాజెక్ట్ కు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు మంత్రి.. రాజీవ్ ప్రతాప్ రూఢీ నేతృత్వంలోని 30 మంది పార్లమెంటరీ కమిటీ సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున స్వాగతం పలికారు మంత్రి నిమ్మల.. ఇక, ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత టీడీపీ ప్రభుత్వంలో 72 శాతం ప్రాజెక్ట్ పనులు పూర్తి చేశాం, వైసీపీ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ ను 20 ఏళ్ల వెనక్కి తీసుకుపోయింది. 18 నెలలు కష్టపడి డయాఫ్రమ్ వాల్ నిర్మిస్తే వైసీపీ ప్రభుత్వం ధ్వంసం చేసిందని విమర్శించారు.. పోలవరంను విధ్వంసం చేసిన, నిర్వాసితులను నిర్లక్ష్యం చేసిన, డయాఫ్రమ్ వాల్ ను ధ్వంసం చేసిన జగన్ కు, వైసీపీకి పోలవరం పై మాట్లాడే అర్హత లేదన్నారు..

Read Also: CM Chandrababu: సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన సీఎం.. ప్రతి ఒక్కరూ ఊరెల్లి నలుగురితో కలవాలి..

ఇక, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ఈ జనవరిలో డయాఫ్రమ్ వాల్ కాంక్రీట్ పనులు మొదలు పెడతాం. 2027 సెప్టెంబర్ కల్లా పోలవరం ప్రాజెక్ట్ ను పూర్తి చేయాలని చంద్రబాబు ఇచ్చిన షెడ్యూల్ కు పూర్తి చేసేలా పని చేస్తున్నాం అన్నారు మంత్రి నిమ్మల.. 2017లో నిర్వాసితులకు రూ 800 కోట్లు పరిహారం అందించిన చంద్రబాబే.. మరలా ఇప్పుడు మరో రూ 800 కోట్లకు పైగా నిధులను అందించారని తెలిపారు.. గత వైసీపీ పాలనలో నిర్వాసితులకు ఒక్క రూపాయు పరిహారం అందలేదు, నిర్వాసితుల కాలనీల నిర్మాణం జరగలేదు.. బిల్లుల చెల్లింపులు జరగలేదని ఆరోపించారు మంత్రి నిమ్మల రామానాయుడు..

Show comments