Liquor Home Delivery: ఆంధ్రప్రదేశ్‌లో లిక్కర్ అమ్మకాలపై ఎలాంటి నిషేధం లేదు.. అయితే, బెల్ట్ షాపులు పెడితే.. బెల్ట్ తీస్తా.. బెండు తీస్తానంటూ సీఎం చంద్రబాబు పలు సందర్భాల్లో స్పష్టం చేశారు.. అయితే, కొన్ని చొట్ల బెల్ట్ షాపులు కూడా నడుస్తున్నాయనే విమర్శలు ఉన్నాయి.. ఈ వ్యవహారంలో ఇంకో అడుగు ముందుకేసి.. లిక్కర్ హోం డెలివరీ చేస్తున్నారు.. ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఇంటింటికి తిరుగుతూ మద్యం అమ్ముతున్న వ్యక్తులను పోలీసుల అరెస్టు చేశారు. మధ్యాహ్నం హోమ్ డెలివరీ చేస్తూ వ్యాపారం సాగిస్తున్న వ్యక్తులపై ఇటీవల సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్ గా మారాయి. ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎన్ఫోర్స్మెంట్ అధికారులు వాహన నెంబర్ ఆధారంగా నిగా పెట్టి మరి నిందితులను అరెస్టు చేశారు. కుక్కునూరు మండలం బయ్యనగూడానికి చెందిన వ్యక్తి జంగారెడ్డిగూడెం నుంచి మద్యం సీసాలు కొనుగోలు చేసి గ్రామాల్లో అమ్మకాలు సాగిస్తున్నారు. టాస్క్ ఫోర్స్ బృందాలు పోలీసులు గాలింపు చర్యలు చేపట్టి వాహన నెంబర్ ఆధారంగా నండ్రు నరేష్,బడుగుల నాగేశ్వరరావు అనే వ్యక్తులను అరెస్టు చేశారు.
Read Also: Supreme Court: ఆర్టీసీ ప్రమాదంపై సంచలన తీర్పు.. బాధిత కుటుంబానికి రూ.9 కోట్లు ఇవ్వాలని ఆదేశం