ఏలూరు జిల్లా ఏజెన్సీ ప్రాంతంలో ఇంటింటికి తిరుగుతూ మద్యం అమ్ముతున్న వ్యక్తులను పోలీసుల అరెస్టు చేశారు. మధ్యాహ్నం హోమ్ డెలివరీ చేస్తూ వ్యాపారం సాగిస్తున్న వ్యక్తులపై ఇటీవల సోషల్ మీడియాలో పలు వీడియోలు వైరల్ గా మారాయి.
Liquor Home Delivery: లిక్కర్ కోసం ఇకపై పబ్బులు, వైన్స్ లు, బార్లకు వెళ్లాల్సిన పని లేకుండా పోయింది మందు బాబులకు.. ఆన్ లైన్ లో ఫుడ్, ఇతర వస్తువులను ఆర్డర్ చేసుకుంటే వాటిని ఇంటి దగ్గరకే తెచ్చి ఇస్తున్నట్లుగా త్వరలోనే లిక్కర్ ను కూడా హోమ్ డెలివరీ చేసే దిశగా సన్నాహాలు చేస్తున్నారు.
హైదరాబాద్‌కు చెందిన ఓ స్టార్టప్ సంస్థ వినూత్నంగా ఆలోచించింది. కేవలం 10 నిమిషాల్లో లిక్కర్ హోం డెలివరీ చేస్తామని ప్రకటన చేసింది. అయితే ఈ ఆఫర్ ఇచ్చింది హైదరాబాద్‌లో కాదు.. కోల్‌కతాలో. ఇన్నోవెంట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ స్టార్టప్ కంపెనీ బూజీ అనే బ్రాండ్‌తో కోల్‌కతాలో లిక్కర్ డోర్ డెలివరీ సర్వీసు ప్రారంభించింది. ఇప్పటికే చాలా మద్యం డెలివరీ చేసే సంస్థలు ఉన్నాయని.. కానీ పది నిమిషాల్లో చేసే సంస్థ తమదేనని ఇన్నోవెంట్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్పేర్కొంది.…