NTV Telugu Site icon

TDP: ఏలూరులో వైసీపీకి బిగ్‌ షాక్.. టీడీపీకి గూటికి మేయర్..

Eluru Mayor

Eluru Mayor

TDP: ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి వరుసగా షాక్‌లు తగులుతున్నాయి.. ఇప్పటికే మాజీ మంత్రులు కొందరు పార్టీకి గుడ్‌బై చెప్పారు.. మరోవైపు మున్సిపాల్టీ కార్పొరేషన్లు, మున్సిపాల్టీలపై దృష్టి సారించింది టీడీపీ.. కొన్నింటిని ఇప్పటికే కైవసం చేసుకుంది టీడీపీ.. ఈ నేపథ్యంలో.. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి ఏలూరులో బిగ్‌షాక్‌ తగలబోతోంది.. ఏలూరు మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌ ఆ పార్టీకి గుడ్‌బై చెప్పి.. టీడీపీలో చేరేందుకు సిద్ధం అయ్యారు.

Read Also: Official : ఇది కదా న్యూస్ అంటే.. రజనీకాంత్ సినిమాలో అమీర్ ఖాన్.. రోలెక్స్ 2.O

ఇటీవల అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో దారుణ ఫలితా లు చవిచూసిన వైసీపీకి ఎదురు దెబ్బలు తగులుతూనే ఉన్నాయి.. ఈ నేపథ్యంలోనే ఏలూరు నగర మున్సిపల్ కార్పొరే షన్ మేయర్ షేక్ నూర్జహాన్.. వైసీపీకి రాజీనామా చేశారు. ఆమె తన భర్త పెద బాబుతో కలిసి ఈ రోజు తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు.. నేడు ఏలూరు నగర మేయర్ షేక్ నూర్జహాన్, ఆమె భర్త కో ఆప్షన్ సభ్యులు SMR పెదబాబు, ఏలూరు నగర వైసీపీ అధ్యక్షుడు బొద్దాని శ్రీనివాస్, పలువురు కార్పొరేటర్లు కూడా.. టీడీపీ గూటికి చేరనున్నారు. ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత మంత్రి నారా లోకేష్ సమక్షంలో టీడీపీ కండువా కప్పుకోనున్నారు. 2013లో టీడీపీలో చేరి అదే పార్టీ తరపున తొలిసారి మేయర్‌గా ఎన్నికైన షేక్ నూర్జహాన్, 2019 ఎన్నికల ముందు వైసీపీలో చేరారు.. ఇప్పుడు తిరిగి టీడీపీ గూటికి చేరనున్నారు మేయర్ దంపతులు.. ఇప్పటికే ఏలూరు వైసీపీ ఇంఛార్జ్‌ పదవితో పాటు ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా మాజీ మంత్రి ఆళ్ల నాని రాజీనామా చేసిన విషయం విదితమే. మేయర్‌తో పాటు పలువురు కార్పొరేటర్లు కూడా టీడీపీలో చేరనున్న నేపథ్యంలో.. ఏలూరు నగరపాలక సంస్థ టీడీపీ వశం అయ్యే అవకాశాలున్నాయి.

Show comments