Body Builders Fighting: ఎవరైనా వీఐపీలు వచ్చినా.. ఏ ఫిల్మ్‌సార్ట్ ఎంట్రీ ఇచ్చినా.. ఇలా ప్రముఖులు వచ్చిన సమయంలో.. సామాన్య ప్రజలు, ఫ్యాన్స్ నుంచి రక్షణా బాడీ బిల్డర్స్‌ను రంగంలోకి దింపుతారు.. కానీ, ఆ బిల్డర్స్ మధ్య ఏర్పడిన ఓ చిన్న వివాదం చిలికి చిలికి గాలివానగా మారి.. తీవ్ర ఘర్షణకు దారి తీసింది.. ఏలూరులో జరిగిన ఘటనకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళ్తే.. సీఆర్ రెడ్డి డిగ్రీ కళాశాల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.. ఏలూరు జిల్లా బాడీ బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కళాశాల ఆధ్వర్యంలో మిస్టర్ ఆంధ్ర పేరుతో బాడీ బిల్డింగ్ పోటీలు ఏర్పాటు చేశారు.. ఈ సందర్భంగా ఏర్పడిన వివాదం చిలికి చిలికి గాలివానగా మారింది.. పోటీలకు విచ్చేసిన బాడీ బిల్డర్స్ గ్రూపులుగా విడిపోయి దాడులు చేసుకున్నారు.. ఈ ఘర్షణలో ఇద్దరికీ గాయాలు కావడంతో, ఏలూరు ప్రభుత్వ వాసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు..
Read Also: Ration Cards: తెలంగాణలో రేషన్ కార్డుల నిబంధనలు మార్చాలి..
ఇక, సమాచారం అందుకున్న వెంటనే ఏలూరు త్రీ టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని అందరిని చెల్లా చెదురు చేశారు.. అయితే పోలీసులు వచ్చేసరికే ఘర్షణకు దిగిన వారంతా అక్కడి నుంచి వెళ్లిపోవడంతో ఘర్షణకు కారణం అయినా విషయాన్ని తమ దృష్టికి తీసుకురావాలని అక్కడ ఉన్నటువంటి వారిని పోలీసులు కోరారు.. సీఐ కోటేశ్వరరావు విద్యార్థులకు, పోటీలకు హాజరైన వారికి కౌన్సిలింగ్ ఇచ్చి అక్కడ నుంచి పంపించేశారు.. అనవసరంగా గొడవలకు దిగితే ఇబ్బందుల్లో పడుతారని హెచ్చరించారు.. పోలీసులు కేసులు నమోదైతే భవిష్యత్తు అంధకారమవుతుందని వార్నింగ్ ఇచ్చారు.. అయితే, పోలీసులు ఘర్షణకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్టుగా తెలుస్తోంది.