Bird Flu: ఉమ్మడి గోదావరి జిల్లాలతో పాటు.. ఏపీలోని పలు జిల్లాలో.. తెలంగాణలోని ఇంకా కొన్ని జిల్లాలో ఇప్పుడు బర్డ్‌ఫ్లూ టెన్షన్ పెడుతోంది.. ఈ సమయంలో.. ఏలూరు జిల్లాలో ఓ వ్యక్తిని బర్డ్‌ఫ్లూ సోకినట్టు ప్రచారం జరిగింది.. ఉంగుటూరు మండలంలో ఒక వ్వక్తి కి బర్డ్ ఫ్లూ నిర్ధారణ అయ్యిందని.. కోళ్ల ఫారం సమీపంలోని ఒక వ్యక్తికి బర్డ్ ఫ్లూ లక్షణాలు ఉండటంతో శాంపిల్స్ సేకరించి పరీక్షించగా.. బర్డ్ ఫ్లూ సోకినట్టు తేలిందని వార్తలు గుప్పుమన్నాయి.. అయితే, ఈ వార్తలపై సీరియస్‌గా స్పందించారు ఏలూరు జిల్లా కలెక్టర్.. ఏలూరు జిల్లాలో బర్డ్ ఫ్లూ విజృంభిస్తోందన్న ఆమె…. అయితే, జిల్లాలోనే కాదు.. రాష్ట్రంలో.. భారత్‌లోనే ఇప్పటి వరకు ఒక్క బర్డ్ ప్లు కేసు కూడా బర్డ్ నుండి మనుషులకు రాలేదని స్పష్టం చేశారు.. ఇప్పటి వరకు జిల్లాలో ఒక్కరికి కూడా ఈ వ్యాధి సోకి మరణించిన దాఖలాలు లేవని క్లారిటీ ఇచ్చారు కలెక్టర్ కె.వెట్రి సెల్వి..
Read Also: Ram Gopal Varma : స్లో మోషన్ లేకపోతే రజినీకాంత్ లేడు : రామ్ గోపాల్ వర్మ
అయితే, బాగా ఉడికించిన ఆహారం తీసుకోవడం వల్ల ఈ వ్యాధులు అరికట్టవచ్చు అన్నారు జిల్లా కలెక్టర్ కె.వెట్రి సెల్వి.. ఉంగుటూరు మండలం బాదంపూడిలో పౌల్ట్రీలలో బర్డ్ ఫ్లూ పాజిటివ్ గా ల్యాబ్ నిర్ధారించిందన్నారు.. బాదంపూడిలో 10 కిలోమీటర్ల పరిధిలో రెడ్ అలర్ట్ ప్రకటించాం.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.. జిల్లా కలెక్టరేట్‌లో పోలీసు, రెవెన్యూ, పశుసంవర్ధక శాఖ, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించిన కలెక్టర్ కె.వెట్రి సెల్వి.. బర్డ్ ఫ్లూ వైరస్ వ్యాప్తి చెందిన కిలోమీటర్ పరిధిలో రెడ్ జోన్ గా పరిగణించాలని.. పది కిలోమీటర్ల వరకు సర్వే లెన్స్ జోన్ గా ప్రకటించాలని.. రెడ్ జోన్ పరిధిలో సెక్షన్ 144, సెక్షన్ 133 అమలు చేయాలని.. బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందిన ప్రాంతాల్లో చికెన్ షాపులు మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.. ఇక, కలెక్టరేట్ లో 24/7 హెల్ప్ లైన్ సెంటర్ ఏర్పాటు చేయడం జరిగిందని వెల్లడించారు జిల్లా కలెక్టర్ కె.వెట్రి సెల్వి..