రెండు తెలుగు రాష్ట్రాల్లో గజరాజుల బెడద వేధిస్తూనే వుంది. పార్వతీపురం మన్యం జిల్లా బలిజిపేట మండలంలోకి శుక్రవారం సాయంకాలం ఏనుగులు రంగ ప్రవేశం చేసాయి. ఒడిస్సా రాష్ట్రం నుంచి పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నుంచి కాలువ గట్టు మీదగా నారాయణపురం చేరుకున్నాయి గజరాజులు. నారాయణపురం నుంచి బలిజిపేట మండలం వెంగాపురం గ్రామం పొలిమేరలో గల పంట పొలాల్లోకి ప్రవేశించాయి. దీంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. అటవీ ప్రాంతంలో సంచరించాల్సిన గజరాజులు మైదాన ప్రాంతంలోకి చేరుకోవడంతో ఎప్పుడు ఏం జరుగుతుందో అని ఈ ప్రాంత ప్రజలు భయాందోళన చెందుతున్నారు.
Read Also: Cyber Fraud: సూర్యాపేట వైద్యాధికారికి సైబర్ కేటుగాళ్ళ బురిడీ
దీపావళి పండగ రావడంతో ఎక్కువ మంది ప్రజలు సామాన్లు కొనుగోలు కోసం రోడ్ల పైన తిరుగుతున్నారు. దీంతో ప్రజలు అనేక భయభ్రాంతులకు గురవుతున్నారు. చేతికి వచ్చిన పంటలు నష్టపోతామేమో అని వారు ఆందోళనకు గురవుతున్నారు. గతంలో అనేక సార్లు గజరాజులు ఇక్కడ హల్ చల్ చేశాయి. గత ఏడాది చిత్తూరు జిల్లాలో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. రామకుప్పం మండలం పాలరేవు గడ్డ గ్రామ సమీపంలో అడవి ఏనుగులు తిరుగుతున్నాయి.
గ్రామ సమీపంలోని టమోటా, వరి పంటలను అడవి ఏనుగులు ధ్వంసం చేశాయని, ఏనుగుల ప్రవేశం వల్ల తాము ఆందోళనతో పాటు నష్టాల పాలు అవుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. టమోటా పంటలపై ఏనుగులు దాడిచేశాయి. కానీ ఏనుగుల వల్ల తమకు భారీగా నష్టం వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగులను అడవిలోకి తరమడానికి ప్రయత్నించారు. గత ఏడాది మే నెలలో పుత్తూరులోని కళ్యాణపురం ఎస్టీ కాలనీలో ఓ మామిడితోట కాపలాదారుడిపై ఏనుగుల గుంపు దాడి చేసి చంపేయడం కలకలం రేపింది. ఇప్పుడు పార్వతీపురంలో ఏనుగులు ఎలాంటి నష్టం కలిగిస్తాయో మరి.
Read Also: Green India Challange : గ్రీన్ఇండియా చాలెంజ్ భాగంగా మొక్కలు నాటిన రమేష్ రెడ్డి
