NTV Telugu Site icon

Chittoor Crime : గొడవలు వద్దని వారించినందుకు అన్నను చంపిన తమ్ముడు

Untitled 1

Untitled 1

Chittoor crime news: మద్యం మనిషి విచక్షణ కోల్పోయేలా చేస్తుంది. అందుకే మద్యం సేవించిన వ్యక్తి ఆ మద్యం మత్తులో తనని తాను మర్చిపోవడంతో పాటుగా మంచి, చెడుల మధ్య ఉన్న వ్యత్యాసాన్ని కూడా గుర్తించలేక పోతాడు. ఆ మద్యం మైకంలో తను చేస్తుంది నేరం అని నేరం చేస్తే శిక్ష తప్పదనే ఆలోచన కూడా చెయ్యలేడు. అందుకే అన్ని అనర్ధాలకి మూలం మద్యపానం. ఇప్పుడు ఈ మాట చెప్పడానికి కారణం మద్యం మత్తులో ఓ వ్యక్తి చేసిన దారుణం. వివరాలలోకి వెళ్తే.. చిత్తూరు జిల్లా వి.కోట మండలం లోని భరత్ నగర్ లో సాంబశివపిళ్ళై, బసవరాజ్ అనే అన్నదమ్ములు అద్దె ఇంట్లో నివాసం ఉంటున్నారు.

Read also:Atrocious: దారుణం.. స్టూడెంట్ పై మాస్టారు అత్యాచారం

కాగా బసవరాజ్ రోజు మద్యం సేవించి ఇంట్లో ఉన్న తన సోదరి కాంచనమ్మతో గోడపడుతుండేవాడు. అయితే ఎప్పటిలానే మద్యం తాగి సోదరి కాంచనమ్మతో గొడవపడుతున్న బసవరాజ్ ని గొడవ పడవద్దు అని వారించి గొడవ పడకుండా అడ్డుకున్నాడు అన్న సాంబశివపిళ్ళై. దీనితో అన్న సాంబశివపిళ్ళై పైన కక్ష పెంచుకున్నాడు బసవరాజ్. ఈ నేపథ్యంలో గొడవలు లేకుండా మాట్లాడుకుందాం అని అన్న సాంబశివపిళ్ళైను పిలిచాడు బసవరాజ్. తమ్ముడు పిలుస్తున్నాడు కదా అని దగ్గరకు వెళ్లిన అన్నని నిర్ధాక్షిణంగా హత్య చేశాడు బసవరాజ్. దీనితో ఆ ప్రాంతంలో విషాద ఛాయలు కమ్ముకున్నాయి.