NTV Telugu Site icon

Gorantla Butchaiah Chowdary: నియోజకవర్గాల పునర్విభజనపై గోరంట్ల కీలక వ్యాఖ్యలు.. బహిరంగంగా వద్దు..!

Gorantla Butchaiah Chowdary

Gorantla Butchaiah Chowdary

Gorantla Butchaiah Chowdary: నియోజకవర్గాల పునర్విభజన వ్యవహారం ఇప్పుడు దేశ రాజకీయాల్లో కాకరేపుతోంది.. ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలు దీనిపై ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.. జనాభా ప్రతిపాదికన పునర్విభజన జరిగితే.. దక్షిణాది రాష్ట్రాలకు నష్టపోనున్నాయి.. దీనిపై ఇప్పటికే చెన్నై వేదిక తమిళనాడు సీఎం స్టాలిన్‌ అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించారు.. నియోజకవర్గాల పునర్విభజనపై గళమెత్తాలని నిర్ణయించారు.. అయితే, ఈ వ్యవహారంపై టీడీపీ సీనియర్‌ నేత, ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు చేశారు.. నియోజకవర్గాలు పునర్విభజనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌.. కేంద్రంతో అంతర్గతంగామాట్లాడుతున్నారన్న ఆయన.. ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నాం కాబట్టి ఈ వ్యవహారంపై బహిరంగంగా మాట్లాడకూడదని పేర్కొన్నారు.. జనాభా విషయంలో దక్షిణాది రాష్ట్రాలు ముందు నుంచి చాలా క్రమశిక్షణ పాటించాయి.. ఇప్పుడు జనాభా పేరుతో సీట్లు తగ్గించడం సరికాదని వ్యాఖ్యానించారు రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి.

Read Also: Neha Kakkar: స్టేజ్‌పై ఎక్కి ఎక్కి ఏడ్చేసిన బాలీవుడ్ సింగర్ నేహా కక్కర్.. కారణమిదే!

ఇక, నిన్న మాజీ సీఎం జగన్ అపర గోబెల్స్ లా మాట్లాడాడు.. మరో మూడేళ్ల తర్వాత అధికారంలోకి వస్తానని జగన్ అంటున్నాడు.. జగన్ వచ్చేది రాజమండ్రి సెంట్రల్ జైలుకే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బచ్చయ్య చౌదరి.. లిక్కర్, మైనింగ్ కుంభకోణాలు ఒక్కొక్కటి బయటికి వస్తున్నాయి.. జగన్ హయాంలో పంటలకు ఇన్సూరెన్స్ కూడా చెల్లించక రైతులు వేల కోట్ల నష్టపోయారు.. జగన్ హయాంలో గ్రామాల్లో ఒక రోడ్డు కూడా వేయలేదని విమర్శించిన ఆయన.. జగన్ మళ్లీ జైలు ఊచలు లెక్కించాల్సిందే అన్నారు.. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా సీఎం సహాయ నిధి నుంచి ప్రజలను ఆదుకుంటున్నాం.. మేలో తల్లికి వందనం, జూన్ లో అన్నదాత సుఖీభవ అమల చేయబోతున్నాం.. రానున్న పుష్కరాలకు రాజమండ్రి చుట్టుపక్కల ప్రాంతాలు అభివృద్ధి చెందెల ప్రణాళికలు వేస్తున్నామని వెల్లడించారు.. రాజమండ్రిలో 12 ఎకరాల్లో క్రికెట్ స్టేడియం నిర్మాణం జరగబోతుంది. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు కేశినేని చిన్నితో ఇప్పటికే మాట్లాడానని తెలిపారు.. గతంలో వైసీపీ కార్యాలయానికి రాజమండ్రిలో అధికారులు తక్షణమే స్థలం ఇచ్చేశారు.. కానీ, టీడీపీ కార్యాలయం కోసం స్థలం అడుగుతుంటే అధికారులు ఇవ్వడం లేదని మండిపడ్డారు గోరంట్ల బుచ్చయ్య చౌదరి.