Site icon NTV Telugu

Cancer: బలభద్రపురంలో రెండో రోజు ఇంటింటి సర్వే.. భయం వద్దొంటున్న అధికారులు

Balabadrapuram

Balabadrapuram

తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు మండలం బలభద్రపురం గ్రామంలో రెండవ రోజు ఇంటింటి సర్వే కొనసాగనుంది. వైద్య బృందం ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే చేపట్టనున్నారు. క్యాన్సర్ కేసుల నమోదు విషయంలో భయాందోళన చెందవలసిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. జాతీయ సగటు కంటే తక్కువగా క్యాన్సర్ పాజిటివ్ కేసులను గుర్తించారు. జాతీయ సగటు ప్రతి 10 వేలకి 30 మందికి క్యాన్సర్ కేసుల నమోదు అవుతుండగా.. బలభద్రాపురంలో 23 కేసులు గుర్తించారు వైద్యాధికారులు. దీంతో.. గ్రామస్థులకు అవగాహాన కల్పించడం కోసం ప్రత్యేక వైద్య పరీక్షలు ఏర్పాటు చేస్తున్నారు. గ్రామాలలో పర్యటించి వైద్య బృందం పరిస్థితిని వివరించనుంది. సోమవారం హోమిబాబా బృందం గ్రామంలో విస్తృత స్థాయిలో ప్రచారం చేపట్టనున్నారు. జాతీయ సగటు రేటు కంటే తక్కువగా క్యాన్సర్ లక్షణాలు ఉన్నట్లు ఇంటింటి సర్వేలో వైద్య ఆరోగ్య శాఖాధికారులు గుర్తించారు. అనుమానిత కేసుల పరీక్షలు నిర్వహించి వైద్య సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతి తెలిపారు.

Read Also: KKR vs RCB : కోహ్లీ మెరుపు ఇన్నింగ్స్.. ఆర్సీబీ ఘన విజయం

కాగా.. బలభద్రపురంలో 200 మందికి పైగా క్యాన్సర్ బారిన పడ్డారు. దీంతో.. ఈ గ్రామాన్ని క్యాన్సర్ మహమ్మారి నుంచి కాపాడాలంటూ ఇటీవల అసెంబ్లీలో ప్రస్తావించారు స్థానిక ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి. క్యాన్సర్‌ కేసులపై అప్రమత్తమైన తూర్పు గోదావరి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు.. శనివారం గ్రామంలో 31 బృందాలతో ఇంటింటి ఆరోగ్య సర్వే, గ్రామస్తులకు స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. బలభద్రపురం సమీపంలో ఉన్న గ్రాసిమ్ ఇండస్ట్రీస్ తో పాటు ఇతర పరిశ్రమల మూలంగా.. గాలి, నీరు కాలుష్యం అవుతున్నాయని.. దాని కారణంగా వందలాది మంది క్యాన్సర్ బారినపడ్డారని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Read Also: Off The Record : ఏపీ కౌన్సిల్ చైర్మన్ వ్యవహార శైలిపై చర్చ

Exit mobile version