NTV Telugu Site icon

Pastor Praveen Kumar: పాస్టర్ ప్రవీణ్ పోస్టుమార్టం పూర్తి.. రాజమండ్రి ఆస్పత్రికి కేఏ పాల్..

Ka Paul

Ka Paul

Pastor Praveen Kumar: పాస్టర్ ప్రవీణ్ మృతదేహానికి రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్టుమార్టం ముగిసింది.. ఆ తర్వాత ప్రవీణ్ భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు వైద్యులు.. దీంతో, రాజమండ్రి ప్రభుత్వాసుపత్రి నుండి హైదరాబాద్ కు అంబులెన్స్ లో ప్రవీణ్ డెడ్‌బాడీని తరలిస్తున్నారు కుటుంబ సభ్యులు.. అయితే, ప్రభుత్వాసుపత్రి పాస్టర్‌ ప్రవీణ్ మృతదేహాన్ని తీసుకెళ్తుండగా.. న్యాయం చేయాలంటూ నినాదాలు చేశారు కొందరు క్రైస్తవులు.. మరోవైపు.. రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రికి చేరుకున్న కేఏ పాల్.. పాస్టర్ ప్రవీణ్ పోస్టుమార్టం జరుగుతున్న మార్చురీ వద్దరకు వెళ్లారు.. పోస్టుమార్టం జరుగుతుండగా.. ఆ ప్రక్రియను తానూ పరిశీలిస్తానన్నారు.. కానీ, పోస్టుమార్టం గదిలోకి పాల్ కు అనుమతించేది లేదని పోలీసులు స్పష్టం చేశారు..

Read Also: Summer Tips : వేసవిలో టానింగ్ ఉండదు.. ఈ విషయాలను జాగ్రత్తగా పాటిస్తే..!

ఇక, కేఏ పాల్ రాకతో భారీగా నినాదాలు చేశారు క్రైస్తవులు.. విచారణలో స్పష్టత రాకపోతే ఈ కేసును సీబీఐకి అప్పగించాలి కేఏ పాల్ డిమాండ్‌ చేశారు.. ప్రవీణ్ మృతిపై అనేకఅనుమానాలు ఉన్నాయి.. నిన్నటి నుంచి ఈ విషయం మీద చాలాసార్లు స్పందించాను.. ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రికి మెసేజ్ లు చేశాను. రెస్పాన్స్ రాలేదన్నారు పాల్.. అయితే, పోస్టుమార్టం ముగిసిన తర్వాత పాస్టర్ ప్రవీణ్ మృతదేహాన్ని రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో పరిశీలించారు కే ఏ పాల్.. ఆ తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. జరిగిన ఘటనపై వాస్తవాలను అధికారులు స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు.. ఏ రకంగా జరిగిందో ఆధారాలతో సహా వివరించాలన్న ఆయన.. క్రైస్తవ సోదరులకు ఉన్న అనుమానాలను నివృత్తి చేయాలని సూచించారు.. ఇప్పటికీ ఈ విషయంపై సీఎం, హోం మంత్రికి సమాచారం ఇచ్చాను.. అవసరం అయితే.. ఈ కేసును సీబీఐకి బదిలీ చేయాలని డిమాండ్ చేశారు కేఏ పాల్..

Read Also: Nagavamshi : వారంతా హాస్పిటల్ లో చేరితే బిల్లులు నేనే కడుతా : నాగవంశీ

కాగా, తూర్పు గోదావరి జిల్లా రాజానగరం పీఎస్‌ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో పాస్టర్‌ పగడాల ప్రవీణ్‌ కుమార్‌ ప్రాణాలు విడిచారు.. హైదరాబాద్‌లోని తిరుమలగిరి సమీపంలో నివాసం ఉండే ప్రవీణ్‌.. అంతర్జాతీయ క్రైస్తవ ప్రసంగీకుడిగా కొనసాగుతున్నారు. అయితే, హైదరాబాద్‌ నుంచి బుల్లెట్‌పై సోమవారం రాత్రి రాజమండ్రి బయల్దేరిన ఆయన.. స్నేహితుడి ఇంటికి వెళ్తున్నానని చెప్పి వెళ్లారు.. ఈ క్రమంలో మార్గమధ్యలో సోమవారం అర్ధరాత్రి మోటార్‌సైకిల్‌ అదుపుతప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లడం.. బైక్‌ కాస్తా ప్రవీణ్‌కుమార్‌పై పడి మృతి చెందినట్టు పోలీసులు చెబుతున్నారు..బుల్లెట్‌తో సహా ప్రవీణ్‌కుమార్‌ రోడ్డు పైనుంచి కిందికి జారిపోవడం, బుల్లెట్‌ ఆయనపై పడిపోవడంతో మృతిచెందినట్టు పేర్కొన్నారు.. కానీ, ప్రవీణ్‌ కుమార్‌ మృతిపై క్రైస్తవ సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి..