Site icon NTV Telugu

MP Purandeswari: దేశాన్ని నరేంద్ర మోడీ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు..

Purandeshwari

Purandeshwari

MP Purandeswari: రాజమండ్రి- మోరంపూడి ఫ్లైఓవర్ నిర్మాణాన్ని మాజీ ఎంపీ మురళీమోహన్ తో కలిసి రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ.. హైవేలపై మరమ్మత్తులు త్వరలోనే ప్రారంభమవుతాయని వెల్లడించారు. ఈ ఫ్లై ఓవర్ కు అనుమతులు తీసుకుని వచ్చింది మురళీమోహన్ సమయంలోనేనని‌ స్పష్టం చేశారు. ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి కేంద్రం 100 కోట్ల రూపాయలను ఖర్చు పెడుతుందని అన్నారు. కొద్ది రోజులుగా ఈ ఫ్లైఓవర్ నిర్మాణానికి అనుమతులు తీసుకుని వచ్చింది.. తామేనని వైసీపీ మాజీ ఎంపీ మార్గాని భరత్ చెప్పుకోవడం సిగ్గుచేటని అన్నారు.

Read Also: Minister Lokesh: ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో అక్రమాలపై మంత్రికి ఫిర్యాదు..

కాగా, ఫ్లై ఓవర్ నిర్మాణానికి అనుమతులు తీసుకుని వచ్చిన మాజీ ఎంపీ మురళీ మోహన్ శిలఫలకం వేస్తే.. ఆ పనులు ప్రారంభం అని మార్గాని భరత్ రామ్ మరో శిలాఫలకం వేయటం విడ్డూరంగా ఉందని ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి ఆక్షేపించారు. బహుశా దేశంలో ఎక్కడా ఇటువంటి ఘటన జరిగి ఉండదు.. భవిష్యత్తులో జరగబోదని వ్యాఖ్యానించారు. దేశాన్ని నరేంద్ర మోడీ అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని తెలిపారు. బలమైన ఆర్థిక శక్తిగా ఎదగాలంటే మౌలిక సదుపాయాలు కావాలని అన్నారు. భారతీయ జనతా పార్టీ (బీజేపీ) హయాంలో రోజుకి 30 కిలో మీటర్ల హైవే రోడ్ల నిర్మాణం జరుగుతుందని పురంధేశ్వరి వెల్లడించారు.

Exit mobile version