Jakkampudi Raja: తూర్పుగోదావరి జిల్లా కోరుకొండలో వైసీపీ అభ్యర్థిపై దాడి ఘటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా నామినేషన్ దాఖలు చేసిన సొంత పార్టీకి చెందిన అభ్యర్థిపై రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా దాడి చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఘటనపై బాధితుడు నుండి వివరాలు సేకరించి వీఆర్వో పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కోరుకొండ పోలీస్ స్టేషన్లో జక్కంపూడి రాజాపై కేసు నమోదు చేశారు. కోరుకొండ మండలం బుచ్చెంపేట గ్రామం నుండి ఎంపీటీసీగా నామినేషన్ వేసిన వైసీపీ అభ్యర్థి అనపర్తి మణికంఠ. గ్రామంలో శివాలయం అభివృద్ధికి 16 లక్షల రూపాయలు ఇస్తానని జనసేన అభ్యర్థి ఇస్తానని ఇచ్చిన హామీ మేరకు నామినేషన్ ఉపసంహరణకు అంగీకరించినట్లు సమాచారం. ఈ మేరకు జనసేన అభ్యర్థి గెలిచినట్లుగా సంబరాలు చేసుకున్నారు.. విషయం తెలుసుకున్న జక్కంపూడి రాజా అనుచరులతో కలిసి. అనపర్తి మణికంఠ ఇంటికి వెళ్లి దాడి చేసినట్లు సమాచారం. దీనితో గ్రామంలోని ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
ఘటనా స్థలానికి పెద్ద సంఖ్యలో చేరుకున్న జనసేన, టీడీపీ, బీజేపీ శ్రేణులు.. ఈ మేరకు వీఆర్వో బాధితుడు నుండి వివరాలు సేకరించి కోరుకొండ పోలీసులకు ఫిర్యాదు చేశారు, వీఆర్వో ఫిర్యాదుపై కోరుకొండ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. బయట వ్యక్తులు ఎవరు రాకుండా గ్రామంలో పోలీస్ పికెటింగ్ ఏర్పాటు చేశారు. మరోవైపు, ఎన్నికల ప్రక్రియలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడితే కఠినంగా వ్యవహరిస్తామని జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ హెచ్చరించారు. దాడులు, దౌర్జన్యాలకు పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని స్పష్టం చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా జరిగేలా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉందని పేర్కొన్నారు.

