Ambati Rambabu: టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును దూషించిన కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో ఉన్నారు.. అయితే, అంబటికి నిద్రలో శ్వాస సంబంధిత సమస్యలు ఉన్న నేపథ్యంలో, స్లీప్ అప్నియా పరికరం ఉపయోగిస్తున్నట్టు జైలు అధికారులు తెలిపారు. వైద్యుల సూచనల మేరకు, నిద్రిస్తున్న సమయంలో శ్వాస తీసుకునే స్థాయి ఒక్కోసారి తగ్గిపోవడంతో శరీరంలో ఆక్సిజన్ స్థాయి పడిపోకుండా ఉండేందుకు ఈ పరికరం ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ సమస్య ఎప్పుడు తలెత్తుతుందో తెలియకపోవడంతో, నిద్రకు ముందు నుంచే పరికరాన్ని అమర్చుకుంటారని వైద్యులు వెల్లడించారు. కోర్టు ఆదేశాల మేరకే అంబటి రాంబాబుకు స్లీప్ అప్నియా పరికరాన్ని అందించినట్లు జైలు అధికారులు స్పష్టం చేశారు. అయితే అంబటి రాంబాబు జైల్లో సంపూర్ణ ఆరోగ్యంతోటే ఉన్నారని చెబుతున్నారు.
Read Also: Deepika Padukone: తల్లిగా బాధ్యతలు.. నటిగా కొత్త పాఠాలు.. దీపికా పదుకొణె ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూ!
