East Godavari Tragedy: తూర్పు గోదావరి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. గత నాలుగు నెలలుగా తన కుమార్తె కనిపించడం లేదని మనస్థాపనతో కొవ్వూరులో ఓ మహిళ గోదావరి నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఆర్చీ బ్రిడ్జి పైకి ఎక్కి గోదావరిలోకి చిలకలపూడి నాగమణి దూకేసింది. అయితే, నాగమణి స్వస్థలం దేవరపల్లి మండలం దుద్దుకూరు గ్రామం.. గోదావరిలో దూకిన నాగమణిని వెంటనే సమీపంలోని మత్స్యకారులు రక్షించారు. ఇక, అపస్మారక స్థితిలో ఉన్న మహిళను కొవ్వూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
Read Also: Mohammed Siraj: సిరాజ్.. ఎంతపని చేశావయ్యా! వీడియో వైరల్
అయితే, 18 ఏళ్ల వయస్సు కలిగిన తన కుమార్తె గత నాలుగు నెలలుగా కనిపించడం లేదని మనస్థాపానికి గురైన బాధిత మహిళ నాగమణి.. బంధువులు, స్నేహితుల ఇళ్ల దగ్గర అన్ని చోట్ల వెతికిన కుమార్తె ఆచూకీ మాత్రం లభించక పోవడంతో ఆవేదన చెందింది. దీంతో ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. ప్రస్తుతం బాధితురాలు నాగమణి కొవ్వూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది.
