NTV Telugu Site icon

Drugs in Birthday Party: బర్త్‌డే పార్టీలో డ్రగ్స్‌.. ముగ్గురు యువకుల అరెస్ట్..

Drugs

Drugs

Drugs in Birthday Party: డ్రగ్స్‌ కల్చర్‌ పెరుగుతూ ఆందోళన కలిగిస్తోంది.. ఇదే సమయంలో.. డ్రగ్స్‌ కట్టడి కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.. తాజాగా, తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం భూపాలపట్నంలో డ్రగ్స్ కలకలం సృష్టించింది.. భూపాలపట్నంలోని పుట్టినరోజు వేడుకలు జరుగుతున్న ఓ ఫంక్షన్ హాల్ వద్ద కారులో డ్రగ్స్ ప్యాకెట్లు బయటపడ్డాయి. కారులో ముగ్గురు యువకులు డ్రగ్స్ సేవిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. డ్రగ్స్ మైకంలో ఉన్న యువకులను రాజానగరం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు డ్రగ్స్ సేవించిన యువకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే, వీరికి డ్రగ్స్ ఎలా వచ్చాయి ? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.. వీరే డ్రగ్స్‌ కొనుగోలు చేసి సేవిస్తున్నారా? ఇంకా ఎవరికైనా సఫ్లై చేస్తున్నారా? అసలు డ్రగ్స్‌ ఎక్కడి నుంచి వచ్చింది..? ఈ రాకెట్‌ వెనుక ఎవరు ఉన్నారు? అనే కోణంలో పోలీసుల విచారణ సాగుతోంది.. కాగా, ఆంధ్రప్రదేశ్‌లో గంజాయి, డ్రగ్స్‌ కట్టడి కోసం ప్రభుత్వం చర్యలకు దిగిన విషయం విదితమే.. డ్రగ్స్‌ వాడకం, సరఫరాను సీరియస్‌గా పరిగణిస్తోంది ఏపీ ప్రభుత్వం..

Read Also: Deputy CM Pawan Kalyan: కుమార్తె ఆధ్యతో కలిసి దుర్గమ్మను దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్

Show comments