Kartika Masam: కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో.. ఓవైపు నదీ తీరాలు.. మరోవైపు శివాలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తోంది.. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో రాజమండ్రి గోదావరి ఘాట్ల వద్ద భక్తుల సందడి అలముకుంది. తెల్లవారుజాము నుంచే వేలాదిగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. గోదావరి తీరం శివనామ స్మరణతో మారుమ్రోగుతోంది. పలు స్నానఘట్టాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక దీపాలు వెలిగించి గోదావరిలో ప్రవాహంలో వదిలి భక్తులు ఆధ్యాత్మిక పరవశంలో మునిగిపోయారు. అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన భక్తులతో శివాలయాలు రద్దీగా మారాయి. పరమేశ్వరుడి దర్శనం కోసం భక్తులు బారులు తీరగా, ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు.
Read Also: Neck Guards: ఏం ఐడియా గురూ.. .. పులులు బారి నుంచి రక్షించుకోవడం కోసం..
ఇక, అంబేద్కర్ కోనసీమ జిల్లా పవిత్ర కార్తీకమాసం ఆఖరి సోమవారం సందర్భంగా ముమ్మిడివరం నియోజకవర్గంలోని శైవక్షేత్రాలు భక్తులతో సందడిగా మారాయి. మురమళ్లలోని భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామి ఆలయం, కుండలేశ్వరం పార్వతీ కుండలేశ్వర స్వామివారి ఆలయాల్లో భక్తుల శివనామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమ్రోగింది. తెల్లవారుజాము నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చి, వృద్ధ గౌతమీ గోదావరిలో పుణ్యస్నానాలు చేసి, గోదావరిలో కార్తీకదీపాలను వదిలారు. అనంతరం మహాశివుని దర్శించుకుని ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు.
మరోవైపు, ప్రకాశం జిల్లా పొదిలిలో కార్తీకమాసం సందర్భంగా మండలంలో అయ్యప్ప స్వామి పడి పూజలు ఘనంగా అంగరంగ వైభవం గా నిర్వహించారు.. మండలంలోని కాటూరి వారి పాలెం, పొదిలి అచ్చిరెడ్డి నగర్ లో అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి పడిపూజ నిర్వహించి భజనలు చేశారు.. భక్తులు స్వామివారికి ప్రత్యేకంగా అభిషేకాలలో పాల్గొన్నారు.. సకల దేవత పాటలు పాడుతూ స్వామివారి సేవలో మునిగిపోయారు.. ఈ కార్యక్రమంలో పొదిలి మండలం మరిపూడి మండలం కొనకలమిట్ల మండలం నుండి సకల మాలాధారణ చేసిన స్వాములు ఇప్పటిపూజ మహోత్సవ పాల్గొని స్వామివారి కృపను పొందారు.. అనంతరం పడిపూజ నిర్వాహకులు తీర్థప్రసాదాలు ఏర్పాటు చేసి భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూశారు.. ఇంకా మండలంలో భారీ పడిపూజలు కూడా ఏర్పాటు చేస్తున్నట్లు పొదిలి అయ్యప్ప స్వామి దేవస్థానం నిర్వాహకులు తెలిపారు..
