Kartika Masam: కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో.. ఓవైపు నదీ తీరాలు.. మరోవైపు శివాలయాల్లో భక్తుల రద్దీ కనిపిస్తోంది.. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో రాజమండ్రి గోదావరి ఘాట్ల వద్ద భక్తుల సందడి అలముకుంది. తెల్లవారుజాము నుంచే వేలాదిగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. గోదావరి తీరం శివనామ స్మరణతో మారుమ్రోగుతోంది. పలు స్నానఘట్టాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక దీపాలు వెలిగించి గోదావరిలో ప్రవాహంలో వదిలి భక్తులు ఆధ్యాత్మిక పరవశంలో మునిగిపోయారు. అయ్యప్ప స్వామి మాలధారణ…