PVN Madhav: కాంగ్రెస్ పార్టీ అధినాయకులు రాహుల్ గాంధీ నైతికంగా దిగజారారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్ ఆరోపించారు. రాహుల్ గాంధీ పిచ్చి పరాకాష్టకు చేరిందని విమర్శించారు.. అందుకే ప్రధాని నరేంద్ర మోడీ తల్లి పై రాహుల్ గాంధీ అనుచితి వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు అంటూ అంటూ ఫైర్ అయ్యారు.. రాజమండ్రిలో మీడియాతో మాట్లాడిన మాధవ్.. రాహుల్ గాంధీని తరిమికొడతామని హెచ్చరించారు.. ఎన్నికల కమిషన్ విసిరిన సవాల్ కు రాహుల్ గాంధీ తోకముడిచారి కామెంట్ చేశారు.. మోడీ తల్లిపై అనుచితి వ్యాఖ్యలకు నిరసనగా రాష్ట్రవ్యాప్తంగా రాహుల్ గాంధీ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తామని చెప్పారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గం నిర్ణయం మేరకు రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనకు పిలుపు ఇచ్చినట్లు తెలిపారు.
Read Also: PM Modi: పాక్ ప్రధాని షెహబాజ్‌కు మోడీ బిగ్ షాక్.. పట్టించుకోని ప్రధాని
ఇక, కుంభమేళ తరహాలో గోదావరి పుష్కరాలు నిర్వహిస్తామని వెల్లడించారు మాధవ్.. దీనిపై ఇప్పటికే కేంద్రమంత్రి షెకావత్ అధ్యయనం చేశారని తెలిపారు.. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా పుష్కరాలు నిర్వహిస్తాయన్నారు.. గోదావరి పుష్కరాలు పేరుతో రాజమండ్రిలో శాశ్వత కట్టడాలకు ప్రాధాన్యత ఇస్తామని, దీనిలో భాగంగా హేవలాక్ బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేస్తామని అన్నారు. దేశంలో మోడీ పరిపాలనపై ప్రజాభిప్రాయ సేకరణ కోసమే చాయ్ పే చర్చ నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రధాని మోడీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి ప్రజల నుండి అనుహ్యా స్పందన లభిస్తుందని అన్నారు పీవీఎన్ మాధవ్.. కాగా, అంతకు ముందు రాజమండ్రిలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ సారథ్యం యాత్ర చేపట్టారు. రాజమండ్రి ఏకేసీ కాలేజ్, ఎన్టీఆర్ పార్క్ వద్ద స్థానికులతో ఛాయ్ పే చర్చ నిర్వహించారు. ఈ సందర్భంగా దేశంలో మోడీ పరిపాలన పై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ప్రజల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక సమస్యలను పలువురు మాధవ్ దృష్టికి తీసుకువెళ్లారు.
