Site icon NTV Telugu

Minister Vasamsetti Subhash: మంత్రి సంచలన వ్యాఖ్యలు.. ఇంటెలిజెన్స్ వర్గాలు పసిగట్టే జగన్ పర్యటనలపై ఆంక్షలు..!

Vasamsetti Subhash

Vasamsetti Subhash

Minister Vasamsetti Subhash: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ పల్నాడు జిల్లా పర్యటనపై పోలీసులు ఆంక్షలు పెట్టినా.. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులతో వెళ్లడం.. అక్కడ ఇద్దరు మృతిచెందడం వివాదాస్పదంగా మారింది. మరోవైపు, ఎల్లుండి చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం పర్యటనకు పోలీసులు కొన్ని ఆంక్షలతో కూడిన అనుమతి ఇచ్చారు.. ఈ నేపథ్యంలో మంత్రి వాసంశెట్టి సుభాష్ సంచలన వ్యాఖ్యలు చేశారు.. వైఎస్‌ జగన్ పర్యటన పేరుతో సైకోలతో కలిసి వ్యర్థం సృష్టించాలని ప్రయత్నిస్తున్నారని ఆరోపించిన ఆయన.. ఇక, ఇంటెలిజెన్స్ వర్గాలు ముందుగా పసిగట్టి.. వైఎస్‌ జగన్ పర్యటనలపై ఆంక్షలు పెడుతున్నారని అన్నారు.

Read Also: Dangerous Stunt: ఎవర్రా మీరంతా.. రీల్స్ కోసం ప్రాణాలను ఇలా పణంగా పెట్టాలా..?

రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా జగన్ అడ్డుకోవటానికి విధ్వంసం సృష్టిస్తున్నారని విమర్శించారు. జగన్ పర్యటనకు జనాలు రాక పోలీసుల ఆంక్షలు అంటూ కుంటి సాకులు చెప్తున్నారని ఫైర్‌ అయ్యారు.. రాజమండ్రిలో పర్యటించిన మంత్రి సుభాష్.. నాలుగో డివిజన్‌లో ఇంటింటికి తిరిగి సుపరిపాలనలో తొలి అడుగు అంటూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా మంత్రి సుభాష్ మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో కూటమీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సుపరిపాలన అందిస్తున్నామన్నారు. ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని అంటున్నారని వెల్లడించారు..

Exit mobile version