Boy Missing From Hospital: రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రిలో శిశువు కిడ్నాప్ కలకలం రేపుతోంది.. ప్రభుత్వ ఆస్పత్రి నుంచి 14 రోజుల పసి బాలుడు కిడ్నాప్ కు గురైన వ్యవహారం చర్చగా మారింది.. డెలివరీ వార్డులోని బాక్స్ లో పెట్టిన పసి పిల్లాడిని తీసుకుని తల్లి హాస్పిటల్ నుండి మాయమైంది. డిశ్చార్జ్ చేయకుండా.. వైద్య సిబ్బందికి చెప్పకుండా తెల్లవారుజామున నాలుగు గంటల సమయంలో పిల్లవాడిని తీసుకుని తల్లి పరారైంది. పిల్లవాడిని తల్లి తీసుకుని వెళ్లినట్లుగా వైద్య సిబ్బంది గుర్తించారు.. తల్లి పోలవరం జిల్లా దేవీపట్నం మండలం డీఎన్ పాలెం కు చెందిన కత్తుల బాపనమ్మ గా గుర్తించారు. ఈ మేరకు రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్. సత్యనారాయణ తెలిపారు.
Read Also: Draupathi 2 : తుగ్లక్ పాత్రలో చిరాగ్ జానీ విశ్వరూపం.. ‘ద్రౌపది 2’ పై పెరిగిన భారీ అంచనాలు!
అయితే, తల్లి బాపనమ్మ.. పిల్లవాడితో కలిసి స్వగ్రామానికి చేరుకున్నట్లు దేవీపట్నం ఆశ వర్కర్లు గుర్తించి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి అధికారులకు సమాచారం అందించారు. తల్లితోపాటు పిల్లవాడిని తిరిగి తీసుకుని వెళ్లి రంపచోడవరం ఏరియా హాస్పిటల్ లో చేర్చినట్లు తెలిసిందని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి సూపరింటెండెంట్. డాక్టర్ సత్యనారాయణ వెల్లడించారు.. అయితే, తన బాబునే ఆ తల్లి తీసుకెళ్లినా.. ఆస్పత్రిలో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా.. అది కూడా తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఆస్పత్రి నుంచి వెళ్లిపోయిన ఘటన కలకలం రేపగా.. తల్లి, బిడ్డ క్షేమంగా ఉండడంతో.. అంతా ఊపిరి పీల్చుకున్నారు..