NTV Telugu Site icon

Dy CM Narayana Swamy: చంద్రబాబు పాలన రాక్షసరాజ్యం.. జగన్ పాలన రామరాజ్యం

Narayana Swamy On Cbn

Narayana Swamy On Cbn

Dy CM Narayana Swamy Fires On Chandrababu Naidu: టీడీపీ అధినేత చంద్రబాబుపై డిప్యూటీ సీఎం నారాయణ స్వామి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. చంద్రబాబు ఎస్సీలను ఆగర్భ శత్రువులుగా చూసేవాడని ఆరోపించారు. చంద్రబాబుకి పదవీదాహం తప్ప మరో దాహమే లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు మేనిఫెస్టోని అసలు ప్రజలు పట్టించుకోవడమే మానేశారన్నారు. చంద్రబాబు తొలుత మేనిఫెస్టోలు పెట్టి, గెలిచిన తర్వాత మాయ చేస్తాడని విమర్శించారు. రామారావును వెన్నుపోటు పోడిచినవారే.. చంద్రబాబు వెంట ఉన్నారని అన్నారు. ఔరంగజేబుకు, చంద్రబాబుకు ఎలాంటి వ్యత్యాసం లేదన్నారు.

Best Cuisine: అత్యుత్తమ వంటకాలకు ఈ టాప్-10 దేశాలు కేరాఫ్

ప్రధాని నరేంద్ర మోడీని నరరూప రక్షసుడు అని చెప్పి.. తీరా ఆ మోడీ కాళ్లే చంద్రబాబు పట్టుకున్నాడని నారాయణ స్వామి పేర్కొన్నారు. పవన్‌ని తిట్టిన చంద్రబాబు, ఇప్పుడు పదవీదాహంతో కీర్తిస్తున్నాడన్నారు. చంద్రబాబు మాల, మాదిగను చీల్చిన వ్యక్తి అని మండిపడ్డారు. 40 సంవత్సరాలు ఏ పనీ చేయని వ్యక్తి.. ఇప్పుడు పేదల్ని ధనవంతుల్ని చేస్తానంటూ మాయమాటలు చెప్తున్నాడంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు దృష్టిలో పేదలంటే దోపిడీదారులు, కబ్జాదారులని వివరించారు. చంద్రబాబుతో కలవడానికి ఏం ఖర్మ పట్టిందోనని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు పాలన రాక్షసరాజ్యం అయితే.. జగన్ పాలన రామరాజ్యం అని అభివర్ణించారు. తమకు ముందస్తుకు వెళ్లే కర్మ లేదన్న ఆయన.. చంద్రబాబుకు దమ్ముంటే ఎన్టీఆర్ ఫోటో లేకుండా ఎన్నికలకు రావాలని సవాల్ విసిరారు.

Delhi Crime: యువతి అందుకు ఒప్పుకోలేదని.. కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది

అంతకుముందు కూడా.. చంద్రబాబు ప్రకటించిన మేనిఫెస్టో ‘వెన్నుపోటు మేనిఫెస్టో’ అని నారాయణ స్వామి ధ్వజమెత్తారు. మినీ మేనిఫెస్టో అంటూ పచ్చి అబద్ధాలతో మళ్లీ ప్రజలను మోసం చేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారని ఆరోపణలు చేశారు. చంద్రబాబు ఇలాంటి మేనిఫెస్టోలను ఎన్ని విడుదల చేసినా.. ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. రాష్ట్ర ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆయన్ను నమ్మరని తేల్చి చెప్పారు. పిల్లనిచ్చి, రాజకీయ భిక్షపెట్టిన ఎన్టీఆర్‌కే వెన్నుపోటు పొడిచిన నీచుడు చంద్రబాబు అని, వెన్నుపోటుకు చంద్రబాబు బ్రాండ్‌ అంబాసిడర్‌ ఎద్దేవా చేశారు. సీఎం వైఎస్‌ జగన్‌ పాలనలో ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారని తెలిపారు.