కృష్ణా జిల్లా అవనిగడ్డ ప్రాంతం నాగాయలంక డ్వాక్రా గ్రూప్ లో మోసం వెలుగులోకి వచ్చింది. తమ డబ్బులు తమకు ఇప్పించండి అంటూ నాగాయలంక వెలుగు ఆఫీస్ ను ఆశ్రయించారు శ్రీ దుర్గా గ్రామైక్య సంఘం మహిళలు. శ్రీదుర్గా గ్రామైక్య సంఘంలో 90 లక్షలు స్వాహా చేసింది రమాదేవి అనే మహిళ. కరోనా సమయంలో బ్యాంకుకు వెళ్లి స్త్రీ నిధి సొమ్ము రూ.52లక్షలు స్వాహా చేసిందామె. అప్పటి బ్యాంకు మేనేజర్ సహాయంతో పొదుపు, వడ్డీలు రూ.40లక్షలు కూడా వేరే ఖాతాలకు మళ్ళింపు జరిగిందని డ్వాక్రా మహిళలు వాపోయారు.
Read Also: Savarkar Row: శరద్ పవార్ మధ్యవర్తిత్వం.. సావర్కర్‌ను విమర్శించనని రాహుల్ గాంధీ హామీ..
నాగాయలంక డ్వాక్రా కార్యాలయం వద్ద బాధిత మహిళల ఆందోళనతో ఉద్రిక్తత చోటుచేసుకుంది. గతంలో రమాదేవి పై పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధిత మహిళలు. అయినా చర్యలు తీసుకోలేదంటున్నారు. తమ సొమ్ముతో ఇల్లు కట్టుకుని, రెండు ట్రాక్టర్లు కొనుక్కుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సంఘ మహిళలు. సస్పెండ్ అయిన సీసీతో పాటు అప్పటి బ్యాంకు మేనేజరును కూడా బాధ్యుడిని చేయాలని డిమాండ్ చేస్తున్నారు బాధిత మహిళలు. వెలుగు అధికారులను బాధిత మహిళలు న్యాయం చేయమని కోరగా ఈ కేసు కోర్టులో ఉందని తమ ఏమి చేయలేమని చెప్పారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు బాధిత మహిళలు.
Read Also: Love Marriage : బిడ్డ టీచరు.. తండ్రి ప్రొఫెసర్.. పరువు పోతుందని అంత పని చేశాడు