జనసేన అధినేత పవన్ కల్యాణ్, ఆ పార్టీ శ్రేణులపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి… తూర్పు గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ఎక్కనుండి పోటీ చేసినా నేను ఓడిస్తానని ప్రకటించారు.. కాకినాడలో ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. పవన్ కళ్యాణ్.. కాకినాడలో కొందరు చెంచాలు చెప్పే మాటలు నమ్మి నాపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు.. వాస్తవాలు తెలుసుకుని నా గురించి మాట్లాడు అంటూ కౌంటర్ ఇచ్చిన ఆయన.. జనసేన నాయకులు, కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ అన్యాయం చేయబోతున్నాడని.. పార్టీని ప్యాకేజీ కోసం మళ్లీ తాకట్టు పెడుతున్నాడంటూ ఆరోపణలు గుప్పించారు.
Read Also: Vangalapudi Anitha: సీఎం జగన్‌కు అనిత బహిరంగ లేఖ.. ఆమెది ప్రభుత్వ హత్యే..!
ఇక, జనసైనికులు బాధ పడే రోజు త్వరలో వస్తుందన్నారు ద్వారంపూడి చంద్రశేఖర్‌రెడ్డి. ఎన్టీఆర్ కే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు.. పవన్ కళ్యాణ్ కు వెన్నుపోటు పొడవడం ఒక లెక్కా…? అంటూ ఎద్దేవా చేశారు.. ప్యాకేజీలకు అమ్ముడుపోయి మీ నాయకులకు, కార్యకర్తలకు అన్యాయం చేయవద్దని పవన్ కళ్యాణ్ ను కోరుతున్నానన్న ద్వారంపూడి.. తూర్పు గోదావరి జిల్లాలో పవన్ కళ్యాణ్ ఎక్కనుండి పోటీ చేసినా నేను ఓడిస్తాను.. నేనే ఇన్ఛార్జ్‌గా బాధ్యతలు తీసుకుంటాను అని ప్రకటించారు.