Telugu News
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
    • ఆంధ్రప్రదేశ్
    • తెలంగాణ
    • జాతీయం
    • అంతర్జాతీయం
  • సినిమాలు
    • సినిమా న్యూస్
    • స్పెషల్స్
    • రివ్యూలు
    • గాసిప్స్
    • OTT
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • రివ్యూలు
  • Web Stories
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • అంతర్జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
  • ఆటోమొబైల్స్
  • బిజినెస్‌
  • టెక్నాలజీ
  • లైఫ్ స్టైల్
  • క్రైమ్
  • English
  • NTV Telugu
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • సినిమా న్యూస్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • వెబ్ స్టోరీలు
  • లైఫ్ స్టైల్
  • బిజినెస్‌
  • క్రీడలు
  • రివ్యూలు
  • Off The Record
  • క్రైమ్
close
Topics
  • IPL 2026
  • Story Board
  • Off The Record
  • OTT
  • Chairman's Desk
  • స్టడీ & జాబ్స్
Folllow NTv Telugu whatsapp channel Live Tv
  • వార్తలు
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • క్రైమ్
  • జాతీయం
  • అంతర్జాతీయం
  • క్రీడలు
    • T20 వరల్డ్ కప్
    • One Day వరల్డ్ కప్
    • ఐ.పి.ఎల్
    • జాతీయ క్రీడలు
    • ఆసియ కప్
    • అంతర్జాతీయ క్రీడలు
  • గ్యాలరీలు
    • Actors
    • Actress
    • General
    • Movies
    • Political
  • బిజినెస్‌
  • భక్తి
  • రాశి ఫలాలు
  • స్పెషల్‌ స్టోరీలు
  • ఆటోమొబైల్స్
  • టెక్నాలజీ
  • Off The Record
Home Andhra Pradesh News Drunk Driving Culprits Told To Pick Rubbish On Visakhapatnam Beach As Punishment

Punishment For Drunk and Driving: మందు బాబులకు వినూత్న శిక్ష.. వైజాగ్‌ బీచ్‌ మొత్తం క్లీన్..!

Published Date :February 21, 2023 , 8:05 pm
By Sudhakar Ravula
Punishment For Drunk and Driving: మందు బాబులకు వినూత్న శిక్ష.. వైజాగ్‌ బీచ్‌ మొత్తం క్లీన్..!
  • Follow Us :
  • google news
  • dailyhunt

Punishment For Drunk and Driving: మద్యం తాగి వాహనాలు నడపొద్దు.. ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దు మొర్రో అని పోలీసులు చెబుతున్నా.. పట్టుకుని ఫైన్లు విధిస్తున్నా.. అరెస్ట్‌ చేస్తున్నా.. బైక్‌లు, కార్లు సీజ్‌ చేస్తున్నా.. కోర్టు శిక్షలు విధిస్తున్నా.. మందు బాబులు మారడం లేదు.. లిక్కర్‌ తాగుతూనే ఉన్నారు.. పోలీసులకు చిక్కుతూనే ఉన్నారు.. తాజాగా, విశాఖ మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు మందు బాబులకు విధించిన శిక్ష ఆస్తికరంగా మారింది.. గత మూడు రోజుల్లో డంకెన్ డ్రైవ్ లో 52 మంది మందుబాబులు విశాఖ పోలీసులకు చిక్కారు. అయితే, అందరినీ అరెస్ట్‌ చేసి కోర్టు ముందు హాజరుపరిచారు పోలీసులు. ఇక్కడే వినూత్నంగా ఆలోచించారు విశాఖ కోర్టు జడ్జి.. మందుబాబులకు జరిమానా మాత్రమే విదిస్తే సరిపోదని భావించిన కోర్టు.. వారిలో పరివర్తన తెచ్చేందుకు పూనుకున్నారు.. అది కూడా సమాజానికి ఉపయోగపడేలా ఉండాలనే కోణం చూస్తూ.. అందరిని బీచ్‌లో ఉన్న వ్యర్థాలను ఏరివేయాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు.

Read Also: Gannavaram: గన్నవరం ఘర్షణ.. టీడీపీ నేతలపై హత్యాయత్నం, అట్రాసిటీ కేసులు..

ఇక, మెట్రోపాలిటన్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు ఆదేశాల మేరకు 52 మంది మందుబాబులను వైజాగ్‌ బీచ్‌కు తీసుకెళ్లారు పోలీసులు.. బీచ్‌లో పడిఉన్న కవర్లు, బాటిళ్లు.. ఇలా అనేక వ్యర్థాలను చేతిలో పట్టుకుని.. బీచ్‌ను శుభ్రం చేసే పనిలో పడ్డారు మందుబాబులు. బీచ్‌లోకి వెళ్లి వ్యర్థాలను ఎరివేశారు.. ట్రాఫిక్ పోలీసులు వారిని గైడ్ చేశారు. కోర్టు తీర్పుపట్ల బీచ్‌కు వచ్చే పర్యాటకులతో పాటు.. స్థానికులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు.. ఇలాగైనా మందు బాబుల్లో మార్పు వస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.. అయితే, మందు బాబులను పోలీసులు బీచ్‌కు తీసుకురావడం.. బీచ్‌ మొత్తం క్లీన్‌ చేయించిన వీడియో ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారిపోయింది. కొందరు.. మందు బాబులకు తగిన శిక్ష ఇది అని కామెంట్లు పెడుతుంటే.. మరికొందరు అసలు లిక్కర్‌ అమ్మడం కంట్రోల్‌ చేయాలి కదా? లిక్కర్‌ అమ్మి వాళ్లను తాగేలా చేసి.. మళ్లీ అరెస్ట్‌ చేయడం ఏంటి? ఫైన్లు ఏంటి? శిక్షలు ఏంటి అని ప్రశ్నిస్తున్నారు.

NTV తెలుగు  వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

  • Tags
  • Andhra Pradesh
  • drunk and driving case
  • Punishment
  • Ramakrishna Beach
  • RK Beach

తాజావార్తలు

  • Vizag Crime: క్రికెట్ విషయంలో వివాదం.. విశాఖలో యువకుడి దారుణ హత్య

  • Iran-Israel War: ట్రెహాన్ నివాసాలపై ఇజ్రాయెల్ దాడి.. 13 మంది మృతి

  • Mrunal Thakur : డెకాయిట్‌లో రిస్కీ యాక్షన్ స్టంట్స్ చేశా!

  • CM Chandrababu Anantapur Visit: నేడు అనంతపురం జిల్లాలో సీఎం పర్యటన.. పూర్తి షెడ్యూల్‌ ఇదే..

  • Dhurandhar 2: ధురంధర్-2 సినిమా వీక్షించిన పాక్ మాజీ ప్రధాని..రియాక్షన్ ఇదే!

ట్రెండింగ్‌

  • 9020mAh భారీ బ్యాటరీ, AMOLED డిస్‌ప్లే, 120FPS గేమింగ్‌ సపోర్ట్ తో వచ్చేస్తున్న’Vivo T5 Pro 5G’..

  • Bladder Issues : మూత్రం అర్జెంట్‌గా వస్తున్నా.. విసర్జన తక్కువగా అవుతోందా.? దీనికి కారణాలివే.!

  • Banana Peel : ముఖానికి అరటిపండు తొక్క.. స్కిన్ స్పెషలిస్టులు చెప్పిన ప్రయోజనాలు, జాగ్రత్తలు.!

  • Tan Tips : ఎండకాలంలో ‘సన్ టాన్’ వేధిస్తోందా.? మీ వంటగదిలోని ఈ 4 పదార్థాలతో మెరిసే చర్మం మీ సొంతం.!

  • Food Tips : FSSAI ప్రకారం.. రోజుకు ఎంత నూనె వాడితే మంచిదో తెలుసా..?

  • twitter
NTV Telugu
For advertising contact :9949494238
Email: digital@ntvnetwork.com

Copyright © 2000 - 2026 - NTV

  • About Us
  • Contact Us
  • Privacy Policy
  • Terms & Conditions