Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు… సీట్లు దక్కేదెవరికి…?
- కొన్ని చోట్ల కేడర్ బలంగా ఉన్నా నడిపే నాయకత్వం కరవు
- మార్పులు తప్పవని జనసేన పెద్దల వార్నింగ్స్
- లోక్‌సభ నియోజకవర్గ సమన్వయ కమిటీల్లో కొత్త వాళ్ళకు పెద్ద పీట
- గోపాలపురం నియోజకవర్గం నుంచే మార్పు మొదలు
- సీనియర్ సువర్ణరాజు స్థానంలో కొత్త వాళ్ళకు ఇస్తారన్న టాక్
- సువర్ణరాజుకు బదులు ఫాతిమా రాణికి ఇస్తారన్న టాక్
- పార్టీ కార్యక్రమాల్లో దూకుడుగా ఉన్న ఫాతిమా రాణి
- చింతలపూడిలో సైతం ఇన్ఛార్జ్ మార్పు కోసం ఆలోచన
- జనసేనలో ఇక నుంచి జనంలో తిరిగే వారికే అవకాశాలు
- సైడ్ చేసే సీనియర్స్ వైఖరి ఎలా ఉంటుందన్న చర్చలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Off The Record: అంబారి ఎక్కిన వాడు ఒకడైతే, అంగట్లో కూరల లెక్క సరిచూసేవాడు మరొకడు అన్నట్టుగా తయారైందట ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో కొన్ని చోట్ల జనసేన పరిస్థితి. పార్టీ అధినేత చెబుతున్నది ఒకటైతే… క్షేత్రస్థాయిలో జరుగుతున్నది మరొకటంటూ ఇక్కడి నేతలు చెవుల కొరుకుంటున్నారు. రిజర్వ్డ్ సెగ్మెంట్లలో సమస్య ఎక్కువగా ఉంటే… మరికొన్ని చోట్ల కూడా అంతే ఉందని అంటున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీకి అండగా నిలబడే కేడర్ ఉన్నా… నడిపించే నాయకత్వ లోపం స్పష్టంగా కనిపిస్తోందన్నది లోకల్ వాయిస్. ఇటీవల వెలుగు చూసిన పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు వ్యవహారమే ఇందుకు ఉదాహరణగా చెప్పుకొస్తున్నారు అక్కడి నేతలు. స్థానిక సంస్థల ఎన్నికల వేళ ఇటీవల పార్టీ పరిస్థితిని పూర్తిస్థాయిలో అధ్యయనం చేసిన గ్లాస్ పెద్దలు ఇక మార్పులు తప్పవని హెచ్చరిస్తున్నట్టు తెలుస్తోంది. కొన్నిచోట్ ఆల్రెడీ మార్పులు మొదలైపోయినట్టు తెలుస్తోంది. స్థానిక ఎన్నికల కోసం ఇటీవల లోక్‌సభ నియోజకవర్గాల వారీగా ప్రకటించిన సమన్వయ కమిటీలే ఇందుకు ఉదాహరణ అంటున్నారు. ఇప్పుడున్న నియోజకవర్గ ఇన్ఛార్జ్లు చాలామంది తేడాగా ఉన్నారని, వాళ్ళని నమ్ముకుని ముందుకెళ్తే నట్టేట మునుగుతామని భావించిన అధిష్టానం… కో ఆర్డినేటర్ల రూపంలో కొత్తవారిని తెరపైకి తీసుకొస్తోందట.
ఆర్థిక బలంతోపాటు… ఉత్సాహంగా పార్టీలో పనిచేసే యువతకు ఎక్కువ ప్రాధాన్యత కల్పిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. దీంతో ఇప్పటి వరకు పని చేయకుండా పెత్తనాలకే పరిమితమైన ఇన్‌చార్జ్‌లను త్వరలో పక్కన పెడతారన్న మాట గట్టిగా వినిపిస్తోంది ఉమ్మడి పశ్చిమ జనసేనలో. ముఖ్యంగా రిజర్వ్డ్ సెగ్మెంట్ అయిన గోపాలపురం పరిస్థితినే ఇందుకు ఉదాహరణగా చూపిస్తున్నారు అక్కడి నేతలు. అక్కడ ఇన్చార్జిగా పనిచేస్తున్న సీనియర్ లీడర్ సువర్ణ రాజు స్థానంలో త్వరలోనే కొత్త కో ఆర్డినేటర్లకు బాధ్యతలు ఇస్తారన్న టాక్ గట్టిగా నడుస్తోంది.. గతంలో వరద బాధితులకు సహాయం అందించే విషయంలో ఆరోపణలు ఎదుర్కోవడం ఓ కారణమైతే.. పార్టీ కోసం పని చేస్తానన్న వారిని కూడా కనీసం లెక్క చేయకపోవడం మరో సమస్యగా మారిందట. కొత్తవారిని కలుపుకుని వెళ్లాలని పెద్దలు చెబుతున్నా పట్టించుకోని తీరుతో విసిగిపోయి మార్పుపై దృష్టి పెడుతున్నట్టు సమాచారం. ఇందులో భాగంగానే ఇటీవల ప్రకటించిన పార్లమెంటు కమిటీలో ఉండి, దూకుడు పెంచిన ఫాతిమా రాణికి త్వరలోనే ఇన్చార్జి బాధ్యతలు అప్పగిస్తారన్నది గోపాలపురం టాక్. కో ఆర్డినేషన్ కమిటీలో ప్రాధాన్యత కల్పించడానికి కారణం అదేనని అంటున్నారు అక్కడి జనసైనికులు. మరోవైపు తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సైతం పార్టీ బలోపేతానికి పనిచేస్తే… నేతలు ఎక్కడున్నా ప్రాధాన్యత కల్పిస్తామంటూ ప్రకటించడం.. ఫాతిమారాణి చేపట్టిన కార్యక్రమాలకు హాజరు కావడంతో గోపాలపురం నియోజకవర్గంలో జనసేన లెక్కలు మారతాయని అంటున్నారు.
Also Read
జిల్లాలోని మరో ముఖ్య రిజర్వు సెగ్మెంట్ చింతలపూడిలోనూ ఇదే తరహాలో కొత్త నేతలను తెరపైకి తీసుకువచ్చింది జనసేన. అలాగే… ఈ నగర పంచాయతీ సీటును తమకు కేటాయించాలని డిమాండ్ చేస్తోంది. కీలకమైన పోలవరం నియోజకవర్గంలో ఇటీవల ఎమ్మెల్యే తీరుతో జరిగిన డ్యామేజ్ ను భవిష్యత్తులో కవర్ చేసుకునేందుకు ఇప్పటినుంచే ఫుల్ ఫోకస్ పెడుతున్నారట. అలా…. అవకాశం ఉన్న ప్రతిచోట పరిస్థితిని చక్కదిద్దుకోవడం బెటర్ అని ఫిక్స్ అయిన పార్టీ పెద్దలు కవలం పెత్తనాలతో సరిపెట్టే సీనియర్స్తోగాక పనిచేసే జూనియర్స్ని అయినా సరే… ప్రోత్సహించాలని భావిస్తున్నారట. మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం దొరకదన్న అనుమానంతో… చాలా మంది సీనియర్ నేతలు జనసేనను వీడేందుకు సిద్ధమవుతున్నారని సమాచారం. దీంతో… జరగబోయే డ్యామేజ్‌ను కవర్ చేసుకోవడానికి ముందుగానే జాగ్రత్త పడుతున్న జనసేన అధిష్టానం … జనంలో తిరిగేవారికే అవకాశం కల్పించాలని భావిస్తున్నట్టు సమాచారం. చింతలపూడి, గోపాలపురం నియోజకవర్గాల విషయంలో గట్టి నిర్ణయాలు ఇందులో భాగమేనని అంటున్నారు. మొత్తానికి స్థానిక ఎన్నికలు కొలిక్కి వచ్చే టైమ్‌కు జనసేనలో పెద్ద మార్పులే కనిపిస్తాయంటున్నారు ఆ పార్టీ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా నాయకులు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మరిన్ని స్థానాల్లో పోటీ చేయాలంటే ఆ మాత్రం బలం పెంచుకోవడం అవసరమేనన్నది పార్టీ వర్గాల అభిప్రాయం. ఆకాశం దక్కించుకునే కొత్త నేతలు ఎలాంటి ప్రభావం చూపుతారో.. సైడ్ కాబోయే సీనియర్స్ ఏం చేస్తారో చూడాలి మరి.
తాజావార్తలు
-
Off The Record: తూర్పు గోదావరిలో కూటమికి తిప్పలు… సీట్లు దక్కేదెవరికి…?
-
New Governors : ఈ రాష్ట్రాలకు కొత్త గవర్నర్ల నియామకం
-
Vaibhav Sooryavanshi: అలా అయితే వైభవ్‌కు చోటు కష్టమే..? మాజీ క్రికెటర్ ఆసక్తికర విశ్లేషణ
-
Jio IPO: జియో మొత్తం ముకేశ్ అంబానీది కాదా? ఐపీవో వేళ బయటపడ్డ షాకింగ్ నిజాలు!
-
Dell XPS 13: Dell XPS 13 వచ్చేసింది.. 2.5K టచ్‌స్క్రీన్, Intel Core Ultra 7 ప్రాసెసర్ తో ప్రీమియం ల్యాప్‌టాప్
ట్రెండింగ్
-
Pressure Cooker Safety: ప్రెషర్ కుక్కర్లో ఈ సమస్య ఉందా? అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు.!
-
Prince Yadav: 6 బంతులు.. 3 ఫోర్లు.. 13 పరుగులు.. ప్రిన్స్ యాదవ్ అరుదైన రికార్డు!
-
T20 Captain Record: ధోనీ, కోహ్లీని వెనక్కి నెట్టి అరుదైన రికార్డు కొల్లగొట్టిన టీమిండియా కెప్టెన్..!
-
Ranji Trophy: బ్యాట్‌తో మోత మోగించిన రవీంద్ర జడేజా.. ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 16వ సెంచరీ నమోదు..!
-
iPhone 17 Pro vs iPhone 18 Pro.. కేవలం ఈ అప్డేట్స్ కోసం కొత్త ఫోన్ అవసరమా.?