NTV Telugu Site icon

Driver Subramanyam Death:డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతిపై తల్లి ఫిర్యాదు

Driver Found In Mlc Car

Driver Found In Mlc Car

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం కలిగించిన ఎమ్మెల్సీ అనంతబాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతిపై అనుమానాలు వ్యక్తం అవుతున్న వేళ అతని తల్లి పోలీసులకు ఫిర్యాదుచేశారు. దీంతో ఎఫ్‌ఐఆర్ నమోదైంది. డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతిపై ఎఫ్ ఐ ఆర్ కాపీ బయటకు వచ్చింది. సెక్షన్ 174 కింద కేసు నమోదు చేశారు పోలీసులు

మృతి పై విచారణ జరపాలని సుబ్రహ్మణ్యం తల్లి ఫిర్యాదు చేసింది. అనుమానితుల పేర్లు ఫిర్యాదు లో చెప్పలేదని చెబుతున్నారు పోలీసులు. అనుమానాస్పద మృతిగా మాత్రమే కేసు నమోదు చేశామని పోలీసులు అంటున్నారు. రాత పూర్వకంగా చెప్తే అనుమానిత వ్యక్తులను విచారణ చేసి ఎఫ్ ఐ ఆర్ లో చేరుస్తామంటున్నారు పోలీసులు. ప్రస్తుతానికి అనుమానాస్పద మృతిగా కేసు దర్యాప్తు జరుగుతోందని పోలీసులు తెలిపారు.

ఇదిలా వుంటే కాకినాడ జీజీహెచ్ లోనే డ్రైవర్ సుబ్రహ్మణ్యం మృతదేహం వుంది. పోస్ట్ మార్టం ఇంకా పూర్తికాలేదు. ఎమ్మెల్సీ అనంతబాబుని అరెస్టు చేస్తే తప్ప పోస్ట్ మార్టం చేయడానికి అంగీకరిస్తూ సంతకం చేసేది లేదని అంటున్నారు కుటుంబ సభ్యులు. దీంతో జీజీహెచ్ వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేశారు.

నిన్న అంతా కాకినాడ జీజీహెచ్ లో హై డ్రామా కొనసాగింది. నిన్న ఉదయం 11 గంటల నుంచి మార్చురీ లోనే ఉంది సుబ్రహ్మణ్యం మృతదేహం. కాకినాడ టూ టౌన్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ఘటన జరిగి దాదాపు 30 గంటలు గడిచిన ఎమ్మెల్సీ అనంతబాబు స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. కొద్దిసేపు ఎమ్మెల్సీ ఫోన్లు స్విచ్ఛాఫ్ అయ్యాయి. తర్వాత ఎమ్మెల్సీ ఓ పెళ్ళికి హాజరయ్యారు. ఇవాళ పోలీసులు ఏం చేస్తారు అనే దానిపై ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ బలగాలతో కాకినాడ జీ జీ హెచ్ దగ్గర అప్రమత్తం అయ్యారు పోలీసులు.

సుబ్రహ్మణ్యం మృతికి ఎమ్మెల్సీ అనంతబాబే కారణమని విపక్షాలు సైతం ఆరోపిస్తున్నాయి. మాజీ ఎంపీ హర్షకుమార్ ఈ ఘటనపై మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో నేడు కాకినాడ రానుంది టీడీపీ నిజ నిర్ధారణ కమిటీ. ఎమ్మెల్సీ అనంత బాబు డ్రైవర్ సుబ్రహ్మణ్యం అనుమానాస్పద మృతిపై టీడీపీ నిజ నిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సభ్యులుగా మాజీ మంత్రి పితాని సత్యనారాయణ, నక్కా ఆనంద్ బాబు,ఎం.ఎస్ రాజు, పీతల సుజాత. పిల్లి మాణిక్యాలరావు వున్నారు.

Harish Shankar: పవన్ సినిమాపై వచ్చిన ఆ రూమర్ నిజమే

Show comments