అందరికీ అందుబాటులో వైద్యసేవలు తీసుకురావడమే తన లక్ష్యమని పల్సస్ సీఈవో డా. గేదెల శ్రీనుబాబు పేర్కొన్నారు. విజయ మోడల్ హాస్పిటల్ ఆధ్వర్యంలో వివిధ ఆరోగ్య సంరక్షణ సంస్థల సహకారంతో రాజాం, పాలకొండ, శ్రీకాకుళంలో నిర్వహించిన వైద్యారోగ్య శిబిరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా గేదెల శ్రీనుబాబు మాట్లాడుతూ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబులిటీలో భాగంగా సేవాదృక్పథంతో ఆస్పత్రులు ప్రారంభించామన్నారు. పల్లె పేదలకు ఉచితవైద్యం అందించేందుకు వైద్యశిబిరాలు నిర్వహిస్తున్నామని తెలిపారు.
ఆరోగ్యం అంటే అనారోగ్యం లేకపోవడమే ఒక్కటే కాదని, శారీరక, మానసిక, సామాజిక శ్రేయస్సు కూడా బాగున్నప్పుడే ఆరోగ్యంగా ఉన్నట్లు అని గుర్తించే ఉత్తరాంధ్రలో అందరికీ ఆరోగ్యం అందించాలనే లక్ష్యంతో ఈ శిబిరాలు నిర్వహిస్తున్నామన్నారు. ఉత్తరాంధ్రలో అఫర్డబుల్ హెల్త్‌కేర్ లక్ష్యంగా పల్సస్-విజయ మోడల్ హాస్పిటల్ కృషి చేస్తోందన్నారు. G20లో టెక్, హెల్త్ సమ్మిట్లు నిర్వహించిన తాను G20 లక్ష్యాలలో ప్రధానమైన అందరికీ అందుబాటులోకి వైద్యం తీసుకురావాలనే హెల్త్‌కేర్ మోడల్ హాస్పిటల్ ప్రారంభించానన్నారు. ఈ ఆస్పత్రుల ప్రారంభం వల్ల గ్రామీణ ప్రాంతాల పేదలకు నాణ్యమైన ఆరోగ్య సంరక్షణ సేవలు అందించగలమని గేదెల శ్రీనుబాబు విశ్వాసం వ్యక్తం చేశారు. విజయ మోడల్ హాస్పిటల్ ద్వారా అందరికీ అందుబాటులోకి వైద్యం తెచ్చామన్నారు. ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తూనే, గ్రామీణ సమాజాలు ఎదుర్కొంటున్న వైద్యారోగ్య సవాళ్లను పరిష్కరిస్తుందన్నారు. ఆరోగ్యవంతమైన సమాజం ఆర్థిక వృద్ధి, సమాజ అభివృద్ధికి దోహదపడుతుందన్నారు. వెనకబడిన ఉత్తరాంధ్రలో ఉపాధి అవకాశాలు కల్పిస్తూనే, విద్య, విజ్ఞాన, వైద్యరంగాల ద్వారా తమ పల్సస్ విశేష సేవలు అందిస్తోందన్నారు. ఈ వైద్యశిబిరాలలో 100 మంది వైద్యులు హాజరై, దాదాపు పదివేల మందికి వైద్యపరీక్షలు చేశారు.