Site icon NTV Telugu

Minister Partha Sarathy: కల్తీ మద్యం పేరుతో డైవర్షన్ పాలిటిక్స్..

Partha Saradu

Partha Saradu

Minister Partha Sarathy: చంద్రబాబు నాయకత్వంలో రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిపై ప్రపంచ వ్యాప్తంగా చర్చ జరుగుతోంది అని మంత్రి పార్థసారథి తెలిపారు. గోబెల్స్ సిగ్గుపడేలా అభివృద్ధి జరుగుతుంది.. వైసీపీ అసత్య ఆరోపణలు చేస్తుంది.. గత ఐదేళ్లు ప్రజలు తీవ్ర భయభ్రాంతులకు గురయ్యారని మండిపడ్డారు. ప్రజలు ఎలా బుద్ధి చెప్తారో ఎన్నికల్లో చూశాం.. మద్యం కుంభకోణాల్లో వాస్తవాలు బయట పడుతున్నాయి.. దీంతో కల్తీ మద్యం పేరిట డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.. నాటి వైసీపీ పాలనలో మద్యంలో సైతం హానికర పదార్థాలు ఉన్నాయని రిపోర్ట్ వచ్చింది.. ఈ రోజు మద్యం పరీక్షల్లో హానికర పదార్థాలు లేవని రిపోర్ట్ వచ్చిందని పార్థసారథి చెప్పుకొచ్చారు.

Read Also: Ayyappa Mala: అయ్యప్ప స్వాములు పాటించే నియమాలు ఏంటో తెలుసా..

అయితే, కూటమి ప్రభుత్వ నిష్పక్ష ధోరణిగా వ్యవహరిస్తుందని మంత్రి పార్థసారథి చెప్పుకొచ్చారు. కల్తీ మద్యంలో జనార్దన్ రావు చెప్పినట్లు రెండేళ్లుగా చేస్తున్నారు.. కల్తీ మద్యంపై ఉక్కు పాదం మోపుతున్నాం.. టీడీపీ నేతలున్నా పార్టీ నుంచి ఇప్పటికే సస్పెండ్ చేశాం.. కల్తీ మద్యాన్ని అరికట్టాలని సురక్షా యాప్ తీసుకొచ్చింది ప్రభుత్వం.. యాప్ ద్వారా హోలో గ్రామ్ నుంచి సమాచారం తెలుసుకోవచ్చు.. దీనిపై తప్పుడు సమాచారం ప్రచారం చేస్తుంది.. వైసీపీ హయాంలో స్కూటర్స్ లో మద్యం డోర్ డెలివరీ చేశారు.. నేడు నేతి బీరకాయ మాటలు చెప్పటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇప్పుడు డిజిటల్ పేమెంట్స్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది చంద్రబాబు సర్కార్.. ప్రభుత్వ అధికారులతో తాము మద్యం అమ్మడం లేదని మంత్రి పార్థసారథి వెల్లడించారు.

Read Also: RRC NER Apprentice Recruitment 2025: రైల్వేలో 1104 జాబ్స్.. రాత పరీక్ష లేదు.. మిస్ చేసుకోకండి

అలాగే, రూ. 99 లిక్కర్ ను ఆపేశారని ఎలా చెప్తారని మంత్రి పార్థసారథి ప్రశ్నించారు. తక్కువ ధరకు లిక్కర్ ను అన్ని నియోజకవర్గాల్లో అందిస్తున్నాం.. బార్లలో 15 శాతం ఎక్కువ టాక్స్ తో లిక్కర్ అమ్మే దానిపై కమిటీ.. పీపీపీ విధానంపై మీకు చిత్తశుద్ధి ఉంటే అసెంబ్లీలో మాట్లాడేవారు.. చంద్రబాబు నాయకత్వంలో కుంభకోణాలు లేకుండా పాలన సాగిస్తోంది.. తక్కువ ధరకు నాణ్యమైన మద్యాన్ని అందిస్తున్నాం.. అధికారుల మనోధైర్యం దెబ్బ తీసేలా వైసీపీ ప్రవర్తిస్తుంది.. చట్టపరంగా పని చేసే అధికారులకు అండగా ప్రభుత్వం ఉంటుంది.. వైసీపీ అధికారంలోకి వస్తామని కలలు కంటుంది.. దళిత, బడుగు వర్గాల అధికారులే టార్గెట్ గా వైసీపీ వ్యవహరిస్తోంది.. సిట్ త్వరలో కల్తీ మద్యంపై వాస్తవాలు బహిర్గతం చేస్తుందని మంత్రి పార్థసారథి తెలిపారు.

Exit mobile version