Andhra Pradesh: త్వరలోనే ఆధార్ కార్డులో జిల్లా పేర్ల మార్పు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో కొత్త జిల్లాలు అమల్లోకి వచ్చాయి. అయితే సంక్షేమ పథకాలు పొందడానికి ఆధార్ కార్డులను అధికారులు ప్రామాణికంగా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డులో పాత జిల్లా పేర్ల స్థానంలో కొత్త జిల్లా పేర్లను చేర్చే విషయంపై అధీకృత సంస్థతో చర్చిస్తున్నామని ఏపీ సీసీఎల్ఏ కార్యదర్శి బాబు వివరించారు. ఆధార్ కార్డులో చిరునామా మార్పుపై మంగళవారం సమావేశం నిర్వహించినట్లు ఆయన తెలిపారు. ఆధార్ కార్డులో మార్పు చేర్పులకు సంబంధించి పలు అంశాలపై సమావేశంలో చర్చించినట్లు పేర్కొన్నారు.
మండలం, పిన్‌కోడ్ మ్యాపింగ్ చేసి వాటి ఆధారంగా మార్పులు చేస్తే ఆధార్‌లోనూ జిల్లా పేర్లు వాటంతట అవే మారేలా చేయవచ్చని సీసీఎల్ఏ కార్యదర్శి బాబు వెల్లడించారు. ఏవైనా అభ్యంతరాలుంటే స్వీకరించి సరిదిద్దవచ్చని తెలిపారు. అయితే ఇది ప్రతిపాదన మాత్రమే అని.. ఇంకా ఆమోదించలేదని పేర్కొన్నారు. ప్రస్తుతానికి ఆధార్‌లో పాత చిరునామా ఉంటుందని.. ప్రింట్ తీసుకున్నా దాని ప్రకారమే వస్తుందని వివరించారు. తెలంగాణలోనూ కొత్త జిల్లాలు అమల్లో ఉన్నాయని.. అక్కడ కూడా ఇదే సమస్య ఉందని సీసీఎల్ఏ కార్యదర్శి గుర్తుచేశారు.
Also Read
తాజావార్తలు
-
Amit Shah: మధ్యాహ్నం 3 గంటలకు రెడీగా ఉండండి.. విపక్షాలకు అమిత్ షా సవాల్
-
Samuk: ఏలియన్ సినిమాకు సిద్ధమవుతున్న అక్షయ్ .. 90% షూటింగ్ లండన్‌లో…
-
AI పెట్టుబడుల వేళ Oracleలో ఉద్యోగాల కోతలు.. వేలాది ఉద్యోగాలపై వేటు?
-
CM Vijay: ఆ స్థానాలే కొనసాగించాలి.. డీలిమిటేషన్‌పై అసెంబ్లీలో విజయ్ తీర్మానం
-
N Chandrasekaran: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. చైర్మన్ పదవికి ‘చంద్రశేఖరన్’ రాజీనామా?
ట్రెండింగ్
-
Akhil NRD: “ప్రేమ పెళ్లి”.. కండక్టర్‌తో లేచిపోయిన ప్రముఖ యూట్యూబర్ భార్య..
-
Ridge Gourd Peel Chutney: బీరకాయ తొక్కతో నోరూరించే పచ్చడి.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే!
-
4K 180Hz డిస్ప్లేతో 55, 65, 75 అంగుళాల్లో Hisense UR8S MiniLED TVలు లాంచ్..!
-
9,070mAh బ్యాటరీ, IP69 రేటింగ్, AMOLED డిస్ప్లేతో REDMI K100 Pro Max లాంచ్..!
-
200MP ట్రిపుల్ కెమెరా సెటప్, 8,580mAh బ్యాటరీ, 185Hz డిస్ప్లేతో REDMI K100 Pro లాంచ్.. ధర ఎంతంటే?