NTV Telugu Site icon

Dhulipalla Narendra: పేదోడ్ని కొట్టి అదానీకి పెడుతున్న జగన్

కేసీఆర్‌ ప్రతి రోజూ ఉదయాన్నే సీఎం జగన్మోహన్ రెడ్డికి దండం పెడుతున్నారు. జగన్‌ వైఖరి వల్ల.. ఏపీలోని విద్యుత్‌ కోతల వల్ల ఏపీ నుంచి పరిశ్రమలు తెలంగాణకు తరలిపోతున్నాయన్నారు టీడీపీ నేత ధూళిపాళ్ళ నరేంద్ర. ఏపీలో ఉన్న పరిశ్రమలు కూడా వెళ్లిపోవాలని అనుకుంటున్నాయి.. ఇక కొత్త పరిశ్రమలు రావడానికే భయపడుతున్నాయి.

ఏపీలోనే సోలార్‌ పవర్‌ రూ. 2కే లభ్యమవుతోంటే.. అదానీ దగ్గర నుంచి రూ. 4కు విద్యుత్‌ కొనుగోలు చేయాల్సిన అవసరమేంటి.?ఎక్కడైనా పెద్దోడ్ని కొట్టి.. పేదోడికి పెడతారు.. కానీ ఏపీలో పేదవాడిని కొట్టి అదానీకి పెడుతున్నారు. ప్రజలేమైనా ఫర్వాలేదు.. అదానీతో చేసుకున్న చీకటి ఒప్పందాలు మాత్రం ఆగకూడదనే రీతిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు నరేంద్ర.

అదానీతో చేసుకున్న చీకటి ఒప్పందాలు కారణంగా పేదలపై వేల కోట్ల రూపాయలు భారం వేస్తున్నారు. దేశంలో ఎక్కడా జరగని అద్భుతాలు ఏపీలోనే జరుగుతాయి.జగన్‌ సీఎం అయ్యాక ఏపీఈఆర్సీ రాష్ట్రంలో విద్యుత్‌ కోతలకు ఆదేశాలిచ్చే సంస్థగా మారింది.విద్యుత్‌ కోతలపై ఏపీ ఈఆర్సీ ఆదేశాలు జారీ చేయడం ఏంటి..?ప్రభుత్వ అసమర్థత.. వైఫల్యాలను కప్పి పుచ్చేందుకు ఏపీ ఈఆర్సీ ప్రయత్నిస్తోంది.

యూనిట్‌ రూ 12కు మించకుండా విద్యుత్‌ కొనుగోలు చేయొద్దంటూ ఏపీ ఈఆర్సీ సీలింగ్ విధించడం ఆశ్చర్యంగా ఉంది. వ్యవసాయానికి తొమ్మిది గంటల నుంచి ఏడు గంటలకు తగ్గించారు.. ఇప్పుడు రోజుకు గంట విద్యుత్‌ సరఫరా ఉండడం కూడా గగనంగా మారింది. విద్యుత్‌ కోతలతో ఆక్వా రంగం అల్లాడుతోంది.పవర్‌ కట్లు.. పవర్‌ హలిడేల్లో మాత్రం జగన్‌ ప్రభుత్వం ప్రగతిని సాధించింది.ఒకప్పుడు వెలుగుల ఆంధ్రప్రదేశ్‌ ఇప్పుడు అంధకార ఆంధ్రప్రదేశ్‌గా మారింది.టీడీపీ హయాంలో ఒక్క రూపాయి కూడా ఛార్జీ పెంచలేదు.. ఒక్క ఛాన్స్‌ అని వేడుకున్న జగన్‌.. ఇప్పుడు ఛార్జీలతో బాదేస్తున్నారన్నారు ధూళిపాళ్ళ నరేంద్ర.

Health : ఆరోగ్యంగా ఉండడం అంటే మనల్ని మనం ప్రేమించుకోవడమే..