ఆంధ్రప్రదేశ్ కేబినెట్‌లో చోటు దక్కించుకున్న ధర్మాన ప్రసాదరావు.. కీలకమైన రెవెన్యూ శాఖ మంత్రిగా నియమితులయ్యారు.. ఇక, ఇవాళ రెవెన్యూ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ధర్మాన ప్రసాదరావు.. ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.. సీఎం వైఎస్ జగన్ లక్ష్యాలు నెరవేరుస్తామని ప్రకటించారు.. రెవెన్యూ అని కాకుండా ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్ అంటే బావుండేదన్న ఆయన.. సీనియర్ అధికారులతో కలిసి ఒక టీంగా పని చేయడం నా అలవాటు అన్నారు.. అనేక చట్టాల వల్ల చాలా భూములు వివాదాల్లో చిక్కుకుంటాయి.. దీని వల్ల ప్రభుత్వానికి.. ఆయా వ్యక్తులకు ఆర్థికంగా ఇబ్బందులు వస్తున్నాయని.. దీన్ని దృష్టిలో పెట్టుకునే భూములను ఫ్రీ హోల్డులోకి తెచ్చే ప్రయత్నంలో భాగంగానే ఇప్పుడు సర్వే చేస్తున్నామని.. ఈ ప్రక్రియ వల్ల పెద్ద ఎత్తున నిధులు మార్కెట్లోకి వస్తాయన్నారు.
Read Also: Komatireddy: కేసీఆర్‌వి డ్రామాలు.. నష్టపోయిన రైతులను ఆదుకోవాలి..
ఇక, చాలా అంశాలు ఛాలేంజీగా తీసుకొని ముందుకెళ్తామని వెల్లడించారు ధర్మాన ప్రసాదరావు.. భూ సమగ్ర సర్వే పూర్తైతే.. జీడీపీ పెరిగి.. మరిన్ని నిధులు వస్తాయన్న ఆయన.. భూ యాజమాన్య హక్కులు కల్పించడం ద్వారా రెవెన్యూ సమస్యలకు పరిష్కారం లభిస్తుందన్నారు. పేదలకిచ్చిన పట్టాలను తక్కువ ధరకే రిజిస్ట్రేషన్ చేయడం వల్ల ఆ వర్గాలకు లబ్ధి చేకూరుతుందని తెలిపారు. కాగా, గత కేబినెట్‌లో ధర్మాన ప్రసాదరావు సోదరుడు ధర్మాన కృష్ణదాసు మంత్రిగా ఉండగా.. తాజా కేబినెట్‌లో ధర్మాన ప్రసాదరావును మంత్రి పదవి వరించిన విషయం తెలిసిందే.