Site icon NTV Telugu

Tirumala: టీటీడీ ఈవోగా ధర్మారెడ్డికి పూర్తిస్థాయి బాధ్యతలు

Dharma Reddy Min

Dharma Reddy Min

టీటీడీ ఈవోగా ధర్మారెడ్డి ఆదివారం నాడు పూర్తిస్థాయిలో బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటివరకు ఆయన అదనపు ఈవోగా సేవలు అందించారు. ప్రస్తుతం ఈవో పదవితో పాటు ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సేవలు అందిస్తున్న జవహర్‌రెడ్డిని ఈవో బాధ్యతల నుంచి ప్రభుత్వం రిలీవ్ చేసింది. ఈ మేరకు సీఎస్ సమీర్‌రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా జవహర్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను స్వామివారి సేవలో 19 నెలలు సేవలందించటం పూర్వజన్మ సుకృతమన్నారు. ఈ మేరకు ఆయన శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో ధర్మారెడ్డికి బాధ్యతలను అప్పగించారు. అనంతరం ధర్మారెడ్డి టీటీటీ ఎక్స్‌ అఫీషియో సభ్యుడిగానూ ప్రమాణం చేశారు.

తిరుమలలో శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు ఇటీవల తీవ్రమైన ఇబ్బందులు పడడం కూడా చర్చనీయాంశమైంది. ఈ నేపథ్యంలో జవహర్‌రెడ్డిని ఈవోగా రిలీవ్‌ చేస్తూ ఆయన స్థానంలో ధర్మారెడ్డికే పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు అప్పగించారు. ప్రస్తుతం రోజూ 70 వేల నుంచి లక్ష మంది భక్తులు కొండకు వస్తున్న నేపథ్యంలో ఈవో నిరంతరం అన్ని అంశాలపై సమీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. కాబట్టే అదనపు ఈవోగా ఉన్న ధర్మారెడ్డికి పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పగించారు.

Ambati Rambabu: జనసేన పార్టీని పెట్టింది చంద్రబాబును సీఎం చేయడానికా?

Exit mobile version