NTV Telugu Site icon

Devulapalli Amar: టీడీపీ 20 ఏళ్లు పాలించినా.. ఎందుకు ఇంకా పేదరికం ఉంది?

Devulapalli Amar

Devulapalli Amar

Devulapalli Amar Comments On YCP Manifesto: సమాజమే దేవాలయం అని చెప్పిన టీడీపీ 20 సంవత్సరాలు పాలించిందని.. అయినా రాష్ట్రంలో ఎందుకు ఇంకా పేదరికం ఉందని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాతీయ మీడియా సలహాదారు దేవులపల్లి అమర్ ప్రశ్నించారు. పేదవాడి కష్టాలు తీర్చేలా సీఎం జగన్ మేనిఫెస్టో పెట్టారని కొనియాడారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన ‘మేనిఫెస్టో అంటే జగన్’ చర్చా కార్యక్రమానికి దేవులపల్లి అమర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేనిఫెస్టోను ఒక పవిత్ర గ్రంథంగా భావించి, అందులో ఉన్నది ఉన్నట్టుగా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోసం అమలు చేసిన వ్యక్తి సీఎం జగన్ అని ఉద్ఘాటించారు. జగన్ 650 హామీలు ఇచ్చారని, అందులో 20 శాతం కూడా అమలు చేయలేదంటూ టీడీపీ ఒక బుక్ రిలీజ్ చేస్తోందని.. మరి, 20 ఏళ్లు పాలించిన టీడీపీ ఎందుకు రాష్ట్రంలో పేదరికాన్ని నిర్మూలించలేకపోయిందని నిలదీశారు.

MT Krishna Babu: 2047 వరకు సికిల్ సెల్ అనీమియా లేకుండా చేయాలన్నదే లక్ష్యం

జగన్ ఒక భిన్నమైన తత్వవేత్త, ఫిలాసఫర్ అని.. నేను చేసిన సంక్షేమం మీకు అందితేనే నాకు ఓటు వేయండని చెప్పడానికి చాలా ధైర్యం కావాలని దేవులపల్లి అమర్ పేర్కొన్నారు. ప్రతీ గడపకు నాయకులు, అధికారులు వెళ్లి.. వారి సమస్యల్ని తెలుసుకుని, వెంటనే పరిష్కరించే వ్యవస్థను జగన్ సృష్టించారన్నారు. ఈ కార్యక్రమం ద్వారా.. ఈ వ్యవస్థలో ఏం జరిగినా క్షణాల్లో జగన్ తెలుసుకుంటారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గ్రామ వాలంటీర్లు, ప్రజా ప్రతినిధులు.. ముఖ్యమంత్రి తరఫున గడప గడపకు తిరిగి నిరంతరం శ్రమించేలా ఒక వ్యవస్థను రూపొందించిన వ్యక్తి జగన్ అని ప్రశంసించారు. దేశంలో ఇటువంటి వ్యవస్థ ఎక్కడా లేదన్నారు. ప్రజా సంక్షేమ పార్టీ కాబట్టే.. మేనిఫెస్టోలో చెప్పిన విధంగా పథకాలు విజయవంతంగా అమలు జరుగుతున్నాయని చెప్పారు. ప్రతి గడపకు లబ్దిచేకూరాలనే ధ్యేయంతో సీఎం పని చేస్తున్నారని అన్నారు. అభివృద్ది అంటే భవనాలు కట్టించడం మాత్రమే కాదని.. పేదరిక నిర్మూలన, ప్రజల శ్రేయస్సు, సంక్షేమమే అభివృద్ది అవుతుందని వివరించారు.

AP JAC Amaravati: ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారమే ఏపీ జేఏసీ అమరావతి లక్ష్యం