Site icon NTV Telugu

తిరుమలకు పెరుగుతున్న భక్తులు.. 8న రథసప్తమికి ఏర్పాట్లు

కరోనా మహమ్మారి కారణంగా గతంలో తిరుమలకు వెళ్ళే భక్తుల సంఖ్య తగ్గింది. ఇటీవల కాలంలో భక్తులు పెరుగుతున్నారు. ప్రతిరోజూ కలియుగ వైకుంఠం తిరుమలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకునే భక్తుల సంఖ్య క్రమేపీ పెరగడంతో ఆదాయం కూడా భారీగానే వస్తోంది. తాజాగా శుక్రవారం తిరుమల శ్రీవారిని 28, 410 మంది దర్శించుకున్నారు. 14,813 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. భక్తుల రాకవల్ల టీటీడీకి రూ.2.08 కోట్ల ఆదాయం లభించింది.

https://ntvtelugu.com/sriramanuja-saharabdi-samaroham-hyderabad/

8వ తేదిన రథసప్తమి వేడుకలను ఏకాంతంగా నిర్వహించనుంది టీటీడీ. 16వ తేదీ నుంచి సర్వదర్శనం భక్తులకు ఆఫ్ లైన్ విధానంలో దర్శన టోకేన్లు జారి చేసే అవకాశం వుందని తెలుస్తోంది. 16వ తేదీన ఆకాశగంగ వద్ద ఆంజనేయస్వామి ఆలయ అభివృద్ది పనులకు, తరిగొండ వెంగమాంబ బృందావనం అభివృద్ది పనులకు భూమి పూజ చేయనున్నారు. 17వ తేదీన టీటీడీ పాలకమండలి సమావేశం కానుంది. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం వుంది.

Exit mobile version