Site icon NTV Telugu

Devineni Uma: అన్ని పార్టీలకు ఎన్టీఆర్ ఆశయాలే అజెండా..

Devineni Uma

Devineni Uma

Devineni Uma: దేశంలోని అన్ని రాజకీయ పార్టీలకు స్వర్గీయ ఎన్టీఆర్ ఆశయాలే అజెండా.. పేదవాడి వద్దకు ప్రజాప్రతినిధులను తీసుకెళ్లింది ఆయనేనని గుర్తుచేసుకున్నారు టీడీపీ సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు.. ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో నిర్వహించిన ఎన్టీఆర్ వర్థంతి కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అయితే, స్థల వివాదంతో కలెక్టర్ ఆదేశాల మేరకు మైలవరం టీడీపీ కార్యాలయానికి తాళాలు వేశారు పోలీసులు.. తాళాలేసిన టీడీపీ కార్యాలయాన్ని పరిశీలించిన దేవినేని ఉమ, కేశినేని చిన్ని… వర్ధంతి కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన బ్లడ్ డొనేషన్ క్యాంప్‌లో రక్తదానం చేశారు.. ఇక, ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ.. పేదవాడికి పట్టెడన్నం పెట్టాలనేదే ఎన్టీఆర్ లక్ష్యం అన్నారు.. ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమం నిర్వహించుకోవడానికి వీల్లేకుండా పోలీసులు కార్యాలయానికి తాళాలు వేశారని ఫైర్‌ అయ్యారు.

Read Also: Kesineni Chinni: కేశినేని బ్రదర్స్‌.. నాని కామెంట్లపై చిన్ని ఆసక్తికర వ్యాఖ్యలు..

బ్లడ్ డొనేషన్ నిమిత్తం బెడ్లు కూడా ఏర్పాటు చేసుకునే అవకాశం పోలీసులు ఇవ్వలేదని మండిపడ్డారు దేవినేని ఉమ.. ప్రభుత్వ తీరు అందరికీ తెలియాలనే నేల మీద పడుకుని బ్లడ్ డొనేట్ చేశానన్నారు.. సీఎం వైఎస్‌ జగన్‌ కళ్లల్లో ఆనందం చూసేందుకే పోలీసులు పని చేస్తున్నారని విమర్శించారు.. దేశంలోని పార్టీలు అన్నింటికీ ఎన్టీఆర్ ఆశయాలే అజెండా.. పేదవాడి దగ్గరకు ప్రజా ప్రతినిధిని తీసుకెళ్లింది ఎన్టీఆరే అన్నారు.. పార్టీ స్థాపించినప్పుడు సృష్టించిన ప్రభంజనాన్ని వచ్చే ఎన్నికల్లో టీడీపీ తిరిగి సృష్టించబోతోందన్న ఆయన.. చంద్రబాబు.. ఎన్టీఆర్ ఆశయాలు కోసం పని చేస్తున్నారు.. లోకేష్ పాదయాత్రలో ప్రతి ఒక్కరూ అడుగులో అడుగేస్తారన్నారు.. వైఎస్‌ జగన్ ఎన్ని తప్పుడు ఆర్డర్లు ఇచ్చినా యువగళం ఆగదని హెచ్చరించారు దేవినేని ఉమామహేశ్వరరావు.

Exit mobile version