Devineni Avinash Satires On TDP Leaders And Pawan Kalyan: తూర్పు నియోజకవర్గంలో టీడీపీ నేతలు చేపట్టిన బస్సు యాత్ర అట్టర్ ఫ్లాప్ అయ్యిందని తూర్పు నియోజకవర్గ వైసీపీ ఇంచార్జీ దేవినేని అవినాష్ విమర్శించారు. అసలు ఆ యాత్రలో టీడీపీ నేతల్ని పట్టించుకునే వారే లేరని ఎద్దేవా చేశారు. యాత్ర ఫ్లాప్ అవ్వడంతో.. టీడీపీ నేతలు పిచ్చిపట్టినట్టుగా వ్యవహరించారని దుయ్యబట్టారు. వైసీపీ నేతలను రెచ్చగొట్టే విధంగా.. 5వ డివిజన్‌లోని వైసీపీ కార్యలయం ముందు నానా హంగామా చేశారని మండిపడ్డారు. ఆఫీస్ వద్ద మందు తాగి, వైసీపీ నేతల్ని రెచ్చగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రోత్సాహంతోనే.. టీడీపి నేతలు ఆ విధంగా ప్రవర్తించారని ఆరోపించారు.
Alla Nani: జగన్‌ని ఎదుర్కొనే ధైర్యం లేకనే.. పవన్ విషం చిమ్మారు
మంచి దళిత నేతగా పేరు తెచ్చుకొన్న కార్పొరేటర్ కలపాల అంబేద్కర్‌పై టీడీపీ నేతలు దాడి చేశారని దేవినేని అవినాష్ ఫైరయ్యారు. కులం పేరుతో దూషించి, అంబేద్కర్ పట్ల దుర్మార్గంగా వ్యవహరించారని అన్నారు. కులం పేరుతో తనని తిట్టారని అంబేద్కర్ ఫిర్యాదు చేస్తే.. ఎల్లో మీడియా అది తప్పుడు ఫిర్యాదు అంటూ రాతలు రాయడం నీచమైన పని అని విరుచుకుపడ్డారు. గతంలో గద్దె రామ్మోహన్ రోడ్డుపై దళిత నేతల్ని కొట్టించారని ఆరోపించారు. జనాలు లేక టీడీపీ నేతల కామినేని నగర్ ప్రోగ్రామ్ క్యాన్సిల్ చేశారన్నారు. కానీ.. ఎల్లో మీడియా రాసిన రాతలు మాత్రం నీచంగా ఉన్నాయన్నారు. టీడీపీ నేతలపై దాడి చేస్తారన్న సమాచారం అందడంతోనే.. ఆ ప్రోగ్రామ్ రద్దు అయ్యిందని చెప్పడానికి సిగ్గుండాలని ధ్వజమెత్తారు. దళిత నేతలపై దాడి చేసి, దూషించిన వారిపై చర్యలు తీసుకోవాలని తాము సీపీ ఆఫీస్‌లో ఫిర్యాదు చేస్తున్నామన్నారు.
Karnataka Assembly: కర్ణాటక అసెంబ్లీలోకి కత్తితో మహిళ.. అరెస్టు చేసిన పోలీసులు
ఎన్నికల సర్వేలు చూసి.. చంద్రబాబు నుంచి కింది స్థాయి టీడీపీ నేతల వరకు భయంతో వణికిపోతున్నారని దేవినేని అవినాష్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో.. వాలంటీర్ వ్యవస్థపై పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యాల్ని ఆయన ఖండించారు. వాలంటీర్ల కష్టం తెలిస్తే, పవన్ ఆ విధంగా మాట్లాడరని అన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓవర్లేకే ఇలాంటి విమర్శలు చేస్తున్నారన్నారు. రిటైనింగ్ వాల్‌పై ఏ సవాల్ స్వీకరించేందుకైనా తాము సిద్ధంగా ఉన్నామన్నారు. టీడీపీ నేతల మాటలు, జోకర్ల మాటల్ని తలపిస్తాయంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.