పులకించిన నిమ్మలకుంట.. దళవాయికి పద్మశ్రీ ప్రదానం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అనంతపురం జిల్లా వాసులు ఆనందంతో ఉబ్బితబ్బిబయ్యారు. తోలుబొమ్మల తయారీలో ప్రసిద్ధి చెందిన అనంతపురం జిల్లా నిమ్మలకుంట గ్రామం సోమవారం ఆనందంతో పులకించిపోయింది. తన ఒడిలో దశాబ్దాలుగా తోలుబొమ్మలు తయారు చేస్తూ గ్రామం పేరును దశదిశలా వ్యాపింపజేసిన కళామతల్లి ముద్దుబిడ్డ దళవాయి చలపతిరావుకు విశిష్ఠ పురస్కారం దక్కినందుకు పరవశించింది. సుప్రసిద్ధ కళాకారుడు దళవాయి చలపతిరావు సోమవారం ఢిల్లీలో ఉన్నత పురస్కారమైన పద్మశ్రీని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా అందుకోవడంతో ఆయన కుటుంబ సభ్యులతోపాటు గ్రామస్థులు సంతోషంలో మునిగిపోయారు.
ఓ కుగ్రామంలో పుట్టిన చలపతిరావు 66 ఏళ్లుగా తోలుబొమ్మల తయారీ, ప్రదర్శనలో ఖ్యాతి గడించారు. ఎన్నో కష్టాలు అనుభవించినా ధైర్యం కోల్పోకుండా తోలుబొమ్మల తయారీని నమ్ముకున్నారు. 78 ఏళ్ల వయసులో పద్మశ్రీ అవార్డు అందుకోవడంతో భార్య సరోజమ్మ, కుమారులు రమణ, వెంకటేష్, కుమార్తెలు తిరుపతమ్మ, వెంకటమ్మ, లలితమ్మ సంతోషం వ్యక్తం చేశారు. చలపతిరావుతో ఫోన్లో మాట్లాడి ఆనందం పంచుకున్నారు. తోటి కళాకారులు, ప్రజాప్రతినిధులు, అధికారులు దళవాయికి అభినందనలు తెలిపారు.
Also Read
- CM Chandrababu: వారికి ఎంతైనా ఖర్చు పెట్టాలనుంది.. కానీ ఖజానా ఖాళీగా ఉంది!
- Vijaya Dairy Election: విజయ డెయిరీ ఎన్నికపై టీడీపీలో హైడ్రామా.. ఆస్పత్రిలో చైర్మన్ చలసాని!
- Rentachintala-Kurnool Murders: రెంటచింతలలో వైసీపీ నేత.. కర్నూలులో టీడీపీ కార్యకర్త హత్య!
- National Handloom Day: చేనేత కుటుంబాలకు భారీ ఊరట.. రూ.179 కోట్లు జమ చేయనున్న ప్రభుత్వం!
తాజావార్తలు
-
Mohammed Siraj: కొలంబోలో ‘డీఎస్పీ సాబ్’ రచ్చ.. సరికొత్త లుక్‌తో మైదానంలో మెరిసిన సిరాజ్
-
7500mAh బ్యాటరీ, 6.9 అంగుళాల 120Hz డిస్ప్లే, 45W ఫాస్ట్ ఛార్జింగ్‌తో REDMI 17 5G లాంచ్..!
-
OG 2 Update: పవన్ కళ్యాణ్ ‘ఓజీ 2’ స్క్రిప్ట్ లాక్.. కానీ బిగ్ ట్విస్ట్!
-
Vu Glo Mini-LED TV: వీయూ గ్లో మినీ ఎల్ఈడీ టీవీ విడుదల.. 120Hz డిస్ప్లే, 50W సౌండ్‌తో కొత్త స్మార్ట్ టీవీ
-
Trent Boult విధ్వంసం.. యార్కర్‌తో బెయిర్‌స్టోకు షాక్.! ‘బై-బై’ సెలబ్రేషన్ వీడియో వైరల్.!
ట్రెండింగ్
-
Will Jacks: సూపర్‌మ్యాన్ ఫీల్డింగ్.. అయ్యా బాబోయ్..! ఏంటి జాక్ క్యాచ్ ను అలా పట్టేశావ్.!
-
John Turner Retirement: ఇంగ్లండ్ స్టార్ సంచలన నిర్ణయం.. 25 ఏళ్లకే క్రికెట్‌కు గుడ్‌బై.. కారణం తెలిస్తే షాక్!
-
Jowar Roti: ‘జొన్న రొట్టె’ విరిగిపోతుందా..? లేదా గట్టిగా అవుతుందా.? ఇలా చేస్తే మెత్తగా, బాగా పొంగే రొట్టెలు గ్యారెంటీ.!
-
10mm డైనమిక్ డ్రైవర్లు, ANC, 48 గంటల బ్యాటరీతో JBL Live Buds 4, Live Beam 4 లాంచ్..!
-
12 అంగుళాల 2K 90Hz డిస్ప్లే, క్వాడ్ స్పీకర్లతో HP OmniPad 12 భారత్‌లో లాంచ్..!