Site icon NTV Telugu

Weather Update: అక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలకు అవకాశం

Tamil Nadu Rains

Tamil Nadu Rains

ఆగ్నేయ మరియు దానికి ఆనుకుని ఉన్న నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం గత 06 గంటల్లో గంటకు 15 కి. మీ .వేగంతో పశ్చిమ వాయువ్య దిశగా కదిలి ఈరోజు, డిసెంబర్ 07, 2022 ,ఉదయం 0830 గంటలకు నైరుతి మరియు ఆనుకుని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం మీద , అక్షాంశం 8.7N మరియు రేఖాంశం 85.7E, వద్ద,ట్రింకోమలీ (శ్రీలంక)కి తూర్పున 500 కి.మీ, దాదాపు 630 కి.మీ. తూర్పు ఆగ్నేయ జాఫ్నాకు (శ్రీలంక), దాదాపు 690 కి.మీ కారైకాల్‌కు మరియు 770 కి.మీ. తూర్పు ఆగ్నేయంగా చెన్నైకి సమీపంలో కేంద్రీకృతమై ఉంది.

ఈ తీవ్ర వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ క్రమంగా ఇవాళ సాయంత్రానికి తుఫానుగా మారి నైరుతి బంగాళాఖాతం యొక్క ఉత్తర తమిళనాడు పుదుచ్చేరికి మరియు దక్షిణ ఆంధ్ర ప్రదేశ్ తీరాలను డిసెంబరు 08 ఉదయం నాటికి చేరుకుంటుంది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తర తమిళనాడు పుదుచ్చేరి మరియు ఆనుకుని ఉన్న దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు తదుపరి 48 గంటలు కొనసాగుతుంది . రాబోయే మూడు రోజులకు వాతావరణ సూచనలు చేసింది వాతావరణ శాఖ. ఉత్తరకోస్తా ఆంధ్రప్రదేశ్ మరియు యానాం ప్రాంతాల్లో ఇవాళ పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉంది. గురువారం తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది.

Read Also: Komatireddy Venkat Reddy: కాంగ్రెస్‌ను ఖతం చేసేందుకు.. బీజేపీ, టీఆర్ఎస్ కలిసి పన్నాగం

రెండురోజుల తర్వాత తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశముంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఇవాళ తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. రేపు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు అనేక చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఈదురు గాలులు గంటకు 50 -60 కి మీ గరిష్టంగా 70 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది. ఎల్లుండి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు చాలా చోట్ల కురిసే అవకాశముంది. భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది .
ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 70 -80 కి మీ గరిష్టంగా 90 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది.

రాయలసీమలో తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు ఒకటి లేక రెండు చోట్ల కురిసే అవకాశముంది. రేపు తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశముంది. భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది . ఈదురు గాలులు గంటకు 50 -60 కి మీ గరిష్టము గా 70 కి మీ వేగం తో వీచే అవకాశం ఉంది. ఎల్లుండి నుంచి తేలిక పాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు ఒకటి లేదా రెండు చోట్ల సంభవించే అవకాశం ఉంది. ఈదురు గాలులు గంటకు 70 -80 కి మీ గరిష్టము గా 90 కి మీ వేగం తో వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Read Also: Border Dispute: సరిహద్దు వివాదం.. కర్ణాటకకు మహారాష్ట్ర బస్సులు బంద్..

Exit mobile version