ఏపీలో అన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు తగ్గుముఖం పట్టినా.. మరో రెండు, మూడు జిల్లాల్లో మాత్రం అదుపులోకి రావడం లేదు.. అందులో చిత్తూరు జిల్లా ఒకటి.. దీంతో.. జిల్లాలో జూన్ 15వ తేదీ వరకు కర్ఫ్యూ అమలు చేయాలని నిర్ణయించారు.. తిరుపతి వెటర్నరీ యూనివర్సిటీ లో కోవిడ్ నియంత్రణపై మీడియాతో మాట్లాడారు మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మేకపాటి గౌతం రెడ్డి, నారాయణస్వామి.. చిత్తూరు జిల్లాలో కర్ఫ్యూ ఆంక్షలు మరింత కఠినతరం చేస్తున్నట్టు ప్రకటించారు పెద్దిరెడ్డి.. ఉదయం 6 గంటల నుంచి 10 గంటల వరకే ప్రజలకు అవకాశం ఉంటుందని.. నిత్యావసరాల కొనుగోలుకు ఆ సమయం మాత్రమే ఇస్తామన్న ఆయన.. జూన్ 1నుంచి ఈ ఆంక్షలు అమల్లోకి వస్తాయన్నారు.. జిల్లాలో కొత్త కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతుండడంతో.. ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు.