Site icon NTV Telugu

Hyderabad-Vijayawada: మరోసారి నిలిచిన విజయవాడ- హైదరాబాద్ మధ్య రాకపోకలు..

Vja Hyd

Vja Hyd

Hyderabad-Vijayawada: విజయవాడ- హైదరాబాద్ మధ్య రాకపోకలకు హైవేపై మరోసారి అవరోధం ఏర్పాడింది. గరికపాడు దగ్గర పాలేరు బ్రిడ్జి దెబ్బ తిన్నది. ఇది ఎన్టీఆర్ జిల్లాలోని జగ్గయ్యపేట మండలం గరికపాడు వద్ద ఆంధ్ర- తెలంగాణ సరిహద్దులోని పాలేరు బ్రిడ్జిపై వరద నీరు ప్రవహిస్తూ రోడ్డును కోసివేయటంతో బ్రిడ్జిపై రాకపోకలను పోలీసులు నిలిపివేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణకు అలాగే తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లే వాహనాల రాకపోకలను ఆపేసి.. బ్రిడ్జికి ఇరువైపుల భారీ వాహనాలను అడ్డుగా పెట్టారు.

Read Also: Bigg Boss Telugu 8: కోట్లు ఇచ్చినా బిగ్‌బాస్‌ చేయనంది.. హుషారెత్తించే స్టెప్పులేస్తూ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది!

అలాగే, ఖమ్మం జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తమ్మిలేరు జలాశయానికి వరద పోటెత్తూతోంది. తమ్మిలేరు జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 355 అడుగులు కాగా ఇప్పటికీ 348 అడుగుల దాటింది. చర్యల్లో భాగంగా 9600 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. తమ్మిలేరు వరద ఉధృతి కారణంగా ఏలూరు- శనివరపు పేట నగరంలో రాకపోకలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాలు జలమయం అవుతున్నాయి. ఇక, ఉధృతంగా ప్రవహిస్తున్న తమ్మిలేరు తమ ఇళ్లపై ఎక్కడ పడుతుందో అనే భయంతో పరివాహక ప్రాంత ప్రజలు ఆందోళన చెందుతున్నారు. భారీ వర్షాలకు తమ్మిలేరు వరద తోడు కావడంతో గట్లు బలహీనంగా మారి కోతకి గురవుతున్నాయి. దీంతో ఎలాంటి ప్రమాదం ఏర్పడుతుందో అనే ఆందోళన పరివాహక ప్రజల్లో కనిపిస్తోంది. ఎగువ నుంచి భారీగా వరద నీరు రావడంతో రాత్రిపూట నిద్రపట్టే పరిస్థితి లేదని తమిళనాడు పరివాహక ప్రాంత స్థానికులు చెబుతున్నారు.

Exit mobile version