NTV Telugu Site icon

CPM: ఏపీ సీపీఎంలో ముసలం.. బీవీ రాఘవులు సంచలన నిర్ణయం..!

Cpm

Cpm

CPM: భారత కమ్యూనిస్టు పార్టీ (మార్క్సిస్టు)లో విభేదాలు ఉన్నా.. అవి బయటపడ్డ సందర్భాలు చాలా తక్కువగా ఉంటాయి.. అంతర్గత సమావేశాల్లో అభిప్రాయ బేధాలు వ్యక్తం అయినా.. నిర్ణయానికి వచ్చేసారికి ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకుంటారు.. అయితే, ఏపీ సీపీఎంలో అగ్రనేతల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరినట్టుగా తెలుస్తోంది.. ఈ నేపథ్యంలో ఉమ్మడి ఏపీలో సీపీఎంలో కీలక నేతగా ఉన్న బీవీ రాఘవులు.. సంచలన నిర్ణయం తీసుకున్నారట.. పొలిట్‌బ్యూరో నుంచి వైదొరడానికి అనుమతి ఇవ్వాల్సిందిగా సీపీఎం పార్టీ కేంద్ర నాయకత్వానికి బీవీ రాఘవులు లేఖ రాశారట.. అయితే, దీని వెనుక పెద్ద కథే ఉందనే ప్రచారం సాగుతోంది.. గత ఏడాది జరిగిన సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి ఎన్నికల్లో బీవీ రాఘవులు ప్రస్తుత కార్యదర్శి వీ శ్రీనివాసరావుకు అనుకూలంగా వ్యవహరించాలని ఆరోపణలు రావడమే దీనికి కారణంగా చెబుతున్నారు.

Read Also: Mekapati Chandrasekhar Reddy: రాజీనామాకు రెడీ.. మేకపాటి ఓపెన్‌ చాలెంజ్‌

ఈ నేపథ్యంలో పార్టీ నుంచి వెళ్లిపోవడానికి సీపీఎం సీనియర్‌ నేతగా ఉన్న మాజీ ఎమ్మెల్యే ఎంఏ గఫూర్ సిద్ధమయ్యారట.. అయితే, గఫూర్ ను వారించారు సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి.. మరోవైపు బీవీ రాఘవులు తీరుపై కేంద్ర కమిటీకి కొంతమంది ఏపీ నేతల ఫిర్యాదు చేసినట్టు ప్రచారం సాగుతోంది.. ఉమ్మడి ఏపీలో సీపీఎం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేసిన రాఘవులు.. ఎన్నో ప్రజాఉద్యమాలకు శ్రీకారం చుట్టారు.. అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం పడిపోయేందుకు దారితీసిన విద్యుత్‌ ఉద్యమానికి ఆద్యుడు కూడా ఆయనే.. ఇప్పుడు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీకి దిశా నిర్దేశం చేస్తూ వస్తున్నారు రాఘవులు. ఇక, ఆయనపై ఆరోపణలు వచ్చినప్పట నుంచి కేరళకు చెందిన మరో పొలిట్ బ్యూరో సభ్యుడు విజయ రాఘవన్ ను తెలుగు రాష్ట్రాలకు పంపుతోంది కేంద్ర పార్టీ.. అప్పటి నుంచి మనస్తాపానికి గురై రాఘవులు.. పొలిట్‌బ్యూరో నుంచి తప్పుకోవడానికే సిద్ధమైనట్టుగా తెలుస్తోంది.. నిత్యం ప్రజల్లో ఉంటూ.. ఉద్యమాలు చేస్తున్నా.. ఎర్రజెండా మసక బారుతోంది.. దీనికి తోడు అంతర్గత వ్యవహారాలు కూడా ఆ పార్టీకి ఎదురుదెబ్బగా మారుతున్నాయి అంటున్నారు రాజకీయ విశ్లేషకులు..

Show comments